ఆ భావనే నన్ను నడిపిస్తోంది!
- అనూప్ రూబెన్స్
క్రిస్మస్ నాకు చాలా ఇష్టమైన పండగ. ఇంట్లో వాళ్లతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. కొత్త బట్టలు, కేక్ కట్ చేయడం ఇవన్నీ మామూలే. పండగ అంటే కేవలం సెలబ్రేషన్స్ అని మాత్రమే కాదు. మనమేం చేస్తున్నామనేది కూడా మనం గమనించుకోవాలి. క్రిస్మస్ అంటే గివింగ్ అని నా ఉద్దేశం. అందుకే ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా అనాథ శరణాలయంలో పిల్లల మధ్య కేక్ కట్ చేస్తాను. నాకు సంగీతమంటే ప్రాణం. మతం, భాష అనే తేడా దానికి లేదు. అందుకే ‘మ్యూజిక్ ఈజ్ డివైన్’ అంటారు.
నేను ఎన్ని పాటలు చేసినా, దేవుడి కోసం ఒక్క పాట చేస్తే చాలు, అప్పటివరకూ ఉన్న మానసిక ఒత్తిడి దూరమవుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. డివోషనల్ సాంగ్స్‌ను స్వరపరచడంలో ఉండే ఆనందమే వేరు. ‘యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు’ అని బైబిల్‌లో ఓ వాక్యం ఉంటుంది. ఆ దైవం నాతో ఉన్నాడన్న భావనే నన్ను ప్రతి నిమిషం ముందుకు నడిపిస్తోంది.