ఏంజెల్ రిలీజ్కు భారీ ప్లాన్స్ | angel movie tamil title vinaithandi vanda angel | Sakshi

ఏంజెల్ రిలీజ్కు భారీ ప్లాన్స్

Jul 8 2017 10:34 AM | Updated on Sep 5 2017 3:34 PM

ఏంజెల్ రిలీజ్కు భారీ ప్లాన్స్

ఏంజెల్ రిలీజ్కు భారీ ప్లాన్స్

విన్నైతాండి వంద ఏంజల్‌ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కుతోంది. సరస్వతి ఫిలింస్‌ పతాకంపై సింధూర పూవ్వు కృష్ణారెడ్డి కథనం, నిర్మాణ బాధ్యతలను చేపట్టిన

తమిళ సినిమా: విన్నైతాండి వంద ఏంజల్‌ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కుతోంది. సరస్వతి ఫిలింస్‌ పతాకంపై సింధూర పూవ్వు కృష్ణారెడ్డి కథనం, నిర్మాణ బాధ్యతలను చేపట్టిన ఈ చిత్రానికి బాహుబలి కె.పళని దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు రాజమౌళి వద్ద బాహుబలి చిత్రానికి సహాయదర్శకుడిగా పని చేశారు. నాగఅన్వేష్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు.

ఇతర ముఖ్య పాత్రల్లో సుమన్, షియాజీషిండే, ప్రదీప్‌రావత్‌లు నటిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ జీవితం చాలా చిన్నది. త్వరగా సంపాదించి బాగా ఎంజాయ్‌ చేయాలని భావించే కథానాయకుడు, సరిగ్గా అలాంటి భావాలు కలిగిన అతని స్నేహితుడి మధ్య కలలో కూడా ఊహించని విధంగా ఒక యువతి వచ్చి చేరుతుంది. తను కూడా ఈ భూమిపై ఉన్న అన్ని సంతోషాలను అనుభవించాలని కోరుకుంటుంది. అలాంటి ఈ ముగ్గురూ అనూహ్యంగా ఒక ఆపదలో చిక్కుకుంటారు. అది ఎలాంటి ఆపద? అందులోంచి వారు ఎలా భయట పడగలిగారన్న పలు ఆసక్తికరమైన ఆశాలతో కూడిన ఈ చిత్రం విన్నైతాండి వంద ఏంజల్‌ కథ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement