మే 19న 'ఏంజెల్' రిలీజ్ | Angel movie releasing on may 19th | Sakshi
Sakshi News home page

మే 19న 'ఏంజెల్' రిలీజ్

Published Tue, Apr 25 2017 11:16 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

మే 19న 'ఏంజెల్' రిలీజ్

మే 19న 'ఏంజెల్' రిలీజ్

నాగ అన్వేష్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఏంజెల్ టీజర్కు మంచి స్పందన వచ్చింది.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా చాలా బాగా వచ్చిందని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని అంటున్నారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో సినిమాను వేసవి కానుకగా మే 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు సింధూరపువ్వు కృష్ణారెడ్డి, భువన్ సాగర్ ప్రకటించారు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆకట్టుకున్న నాగ అన్వేష్ హీరో చేస్తున్న రెండో సినిమా ఏంజెల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement