న్యూఢిల్లీ: ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ (ఐపీవీ) అంకుర సంస్థల్లో ఈ ఏడాది సుమారు రూ. 150–200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు సంస్థ సీఈవో వినయ్ బన్సల్ తెలిపారు. డ్రోన్, స్పోర్ట్స్, హెల్త్, ఫిన్‌టెక్ సంస్థల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు.
తమ దగ్గర రూ. 1,200 కోట్ల నిధులు ఉండగా ఇప్పటివరకు రూ. 750 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. 2023లో 56 పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. వీటిల్లో 46 కొత్తగా ఇన్వెస్ట్ చేసినవి కాగా మిగతావి ఫాలో–ఆన్ పెట్టుబడులని బన్సల్ పేర్కొన్నారు.
గతేడాది సగటున 61 శాతం మేర రాబడులతో 14 సంస్థల నుంచి వైదొలిగినట్లు చెప్పారు. 2023లో ఒక మీడియా స్టార్టప్, కూవర్స్, స్పోర్టిడో మొదలైన వాటి నుంచి ఐపీవీ పూర్తిగా నిష్క్రమించింది. మీడియా వెంచర్‌లో పెట్టుబడులపై దాదాపు 200 శాతం రాబడి అందుకున్నట్లు బన్సల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment