అమ్మాయి... ఆపద... ప్రేమ! | 'Angel' targets summer release | Sakshi
Sakshi News home page

అమ్మాయి... ఆపద... ప్రేమ!

Published Sat, Apr 8 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

అమ్మాయి... ఆపద... ప్రేమ!

అమ్మాయి... ఆపద... ప్రేమ!

ఏంజెల్‌ అంటే... దేవత! అందంలో, మానవత్వంలో సరిగ్గా దేవత లాంటి అమ్మాయే ఎదుట ప్రత్యక్షమైతే... ఏ అబ్బాయి అయినా ప్రేమలో పడతాడుగా! అలాగే, ఓ అబ్బాయి ప్రేమలో పడ్డాడు. దేవత ప్రేమతో పాటు అనుకోని ఆపద ఎదురైనప్పుడు అబ్బాయి ఏం చేశాడనే కథతో రూపొందుతోన్న సినిమా ‘ఏంజెల్‌’. నాగ అన్వేష్, హెబ్బా పటేల్‌ జంటగా భువన సాగర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో రూపొందుతోన్న ఈ సినిమాతో ‘బాహుబలి’ పళని దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. మే రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సింధూరపువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ – ‘‘సోషియో ఫాంటసీ చిత్రమిది. ఫస్ట్‌ లుక్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. హిందీ రీమేక్‌కి అడుగుతున్నారు. సినిమాలో ప్రేమకథ, విజువల్‌ ఎఫెక్ట్స్, భీమ్స్‌ మ్యూజిక్‌ హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement