మరో రెండు భాషల్లో రిలీజ్‌ | Hebah Patel's 'Angel' will be released on November 3 | Sakshi
Sakshi News home page

మరో రెండు భాషల్లో రిలీజ్‌

Published Sun, Oct 22 2017 1:06 AM | Last Updated on Sun, Oct 22 2017 1:06 AM

Hebah Patel's 'Angel' will be released on November 3

‘వినవయ్యా రామయ్యా’ ఫేమ్‌ నాగ అన్వేష్, ‘కుమారి 21ఎఫ్‌’ ఫేమ్‌ హెబ్బా పటేల్‌ జంటగా రూపొందిన చిత్రం  ‘ఏంజెల్‌’. రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శ కత్వంలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో సరస్వతి ఫిలింస్‌ పతాకంపై భువన్‌ సాగర్‌ నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 3న విడుదల కానుంది. ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ మూవీ ఇది. 45 నిమిషాలకు పైగా సీజీ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌) సీన్స్‌ ఉండటంతో నాలుగు నెలలు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం వర్క్‌ చేశాం.

స్నో వైట్‌ అండ్‌ ద హంట్స్‌మాన్, థార్, ఎవెంజర్స్‌ వంటి ప్రఖ్యాత హాలీవుడ్‌ సినిమాలకి గ్రాఫిక్స్‌ అందించిన సీజీ నిపుణుల పర్యవేక్షణలో ‘ఏంజెల్‌’ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు జరిగాయి. తెలుగులో నవంబర్‌ 3న తెలుగులో, వారం తర్వాత హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కళ్లు చెదిరే గ్రాఫిక్స్, బాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌ రవివర్మ భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అలరిస్తాయి. సెంటిమెంట్‌ సన్నివేశాల్లో నాగ అన్వేష్‌ పలికించిన ఎమోషన్స్‌ సూపర్బ్‌’’ అన్నారు పళని. ‘‘పాటలు, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చిందన్నారు అన్వేష్‌. ఈ సినిమాకి సమర్పణ: ముప్పా వెంకయ్యచౌదరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement