Hebbapatel
-
నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ
సాక్షి, హైదరాబాద్ : కుర్ర హీరో రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. టాలీవుడ్ టాప్ హీరో చైతన్య అక్కినేని దీన్ని లాంచ్ చేశారు. నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ అనే డైలాగుతో విడుదలైన ఈ ట్రైలర్ ఈ సినిమా మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, వరుస విజయాలతో జోరుమీదున్న రాజ్‌తరుణ్ ఖాతాలో మరో విజయం ఖాయంగా కనిపిస్తోంది. మాళవిక నాయర్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా, అలనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్ ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. ఇంకా నరేష్, పోసాని కృష్ణమురళి లాంటి సీనియర్లతోపాటు, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజారవీంద్ర, అజయ్ ఘోష్, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్ లాంటి ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. కాగా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో అక్టోబర్ 2న విడుదల కానుంది.విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో, కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనుప్ రుబెన్స్ అందించారు. -
ఉత్సవం చెరి సగం
అరుణ్ ఆదిత్, హెబ్బా పటేల్ జంటగా ‘మిణుగురులు’ ఫేమ్ అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘24 కిస్సెస్’. సిల్లీమాంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ పతాకాలపై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయో«ధ్య కుమార్ నిర్మించారు. శుక్రవారం ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ ్టలుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘నీకో సగం నాకో సగం ఈ ఉత్సవం’ అనే ట్యాగ్‌లైన్ ఉన్న ఈ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం టీజర్ ఈ రోజు రిలీజ్ కానుంది. అదితి మ్యాక, రావు రమేశ్, నరేశ్ ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమాకు జాయ్ బరువ సంగీతం అందించారు. గిరిధర్ మావిడిపల్లి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ∙హెబ్బాపటేల్, అరుణ్ ఆదిత్ -
సినిమాయే దైవం.. బలం.. బాధ్యత
‘‘ఇటీవల యూనిట్ అంతా ‘ఏంజెల్’ సినిమా చూశాం. చాలా బాగుంది. సంతోషంగా అనిపించింది. ఆఫ్ స్క్రీన్ చేసి వర్క్‌ని స్క్రీన్‌పైన చూస్తే వచ్చే ఆనందమే వేరుగా ఉంటుంది. దాన్నే ప్యాషన్ అంటారు’’ అని నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి అన్నారు. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ‘ఏంజెల్’ నవంబర్ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘ నాకు సినిమానే దైవం, బలం, బాధ్యత. ‘ఏంజెల్’ సినిమా బావుందంటూ సెన్సార్ సభ్యులు అభినందించడం సంతోషంగా ఉంది. నాగ అన్వేష్ డ్యాన్సులు, ఫైట్స్, స్క్రీన్ ప్రెజన్స్ చూసి, త్వరలోనే తెలుగులో టాప్ స్టార్స్‌లో ఒకడు అవుతాడనిపించింది. ‘ఏంజెల్’ సినిమా బిజినెస్ చూసిన తర్వాత నిర్మాతగా నమ్మకం కలిగింది. తెలుగులో నవంబర్ 3న రిలీజ్ చేస్తాం. తమిళ, కన్నడ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారం లేదా రెండు వారాల గ్యాప్‌తో అక్కడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
మరో రెండు భాషల్లో రిలీజ్
‘వినవయ్యా రామయ్యా’ ఫేమ్ నాగ అన్వేష్, ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ హెబ్బా పటేల్ జంటగా రూపొందిన చిత్రం ‘ఏంజెల్’. రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శ కత్వంలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో సరస్వతి ఫిలింస్ పతాకంపై భువన్ సాగర్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ మూవీ ఇది. 45 నిమిషాలకు పైగా సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) సీన్స్ ఉండటంతో నాలుగు నెలలు విజువల్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ చేశాం. స్నో వైట్ అండ్ ద హంట్స్మాన్, థార్, ఎవెంజర్స్ వంటి ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాలకి గ్రాఫిక్స్ అందించిన సీజీ నిపుణుల పర్యవేక్షణలో ‘ఏంజెల్’ విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరిగాయి. తెలుగులో నవంబర్ 3న తెలుగులో, వారం తర్వాత హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కళ్లు చెదిరే గ్రాఫిక్స్, బాలీవుడ్ స్టంట్ మాస్టర్ రవివర్మ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయి. సెంటిమెంట్ సన్నివేశాల్లో నాగ అన్వేష్ పలికించిన ఎమోషన్స్ సూపర్బ్’’ అన్నారు పళని. ‘‘పాటలు, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చిందన్నారు అన్వేష్. ఈ సినిమాకి సమర్పణ: ముప్పా వెంకయ్యచౌదరి. -
నిర్మాతల పరిస్థితి దారుణం
తమిళసినిమా; తెలుగు సినీ నిర్మాతలు ప్లైట్ టిక్కెట్లు ఇచ్చే బిచ్చగాళ్లుగా మారారని సీనియర్ దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్ అన్నారు. ప్రముఖ తెలుగు నిర్మాత సిందూరపువ్వు కృష్ణారెడ్డి తాజాగా నిర్మిస్తున్న త్రిభాషా భారీ చిత్రం విన్నైతాండి వంద ఏంజల్. ఆయన కొడుకు నాగాన్వేషణ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా హెబ్బాపటేల్ కథానాయకిగా నటిస్తోంది. బాహుబలి చిత్రానికి రాజమౌళి వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన కే.పళని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి బీమ్స్ సినీరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ బుధవారం ఉదయం చెన్నైలో జరిగింది. 17 ఏళ్ల తరువాత.. చిత్ర నిర్మాత సిందూరపూవ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ 17 ఏళ్ల తరువాత మళ్లీ చెన్నై వచ్చానని అన్నారు. విన్నైతాండి వంద ఏంజల్ చిత్రం గురించి చెప్పాలంటే ఇది బాహుబలి చిత్రం తరహాలో సాగే సోషియో ఫాంటసీ, కామెడీ, లవ్ ఎంటర్టెయినర్ కథా చిత్రం అని తెలిపారు. ఇందులో సీజీ వర్క్ హైలెట్‌గా ఉంటుందన్నారు. దర్శకుడు బాహుబలి కే.పళని తనను కలిసి కథ చెప్పారన్నారు. ఈ చిత్రం తమిళంలోనూ బాగుంటుందని దర్శకుడు చెప్పడంతో ద్విభాషా చిత్రంగా చేయడానికి సిద్ధం అయ్యామని, ఆ తరువాత ముంబైకి చెందిన రుషేంద్రరెడ్డి అనే నిర్మాత చిత్రంలోని సీజీ వర్క్‌ను చూసి చిత్రానికి ఇంత ఖర్చు చేస్తున్నారు వర్కౌట్ అవుతుందా? అని అడిగారన్నారు. కథ డిమాండ్ మేరకు ఖర్చు పెడుతున్నామని చెప్పగా హిందీ వెర్షన్ హక్కులు తనకు ఇస్తారా?అని అడిగారన్నారు.అలా ఈ చిత్రం త్రిభాషా చిత్రం అయ్యిందని సిందూరపువ్వు కృష్ణారెడ్డి వివరించారు. టాలీవుడ్లో మన వారికి గౌరవం అధికం దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్ మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమలో తమిళ కళాకారులకు చాలా గౌరవం అని పేర్కొన్నారు. అంతటి గౌరవం ఇక్కడ లేదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభకు గుర్తింపునిస్తారని, సార్ డైరెక్టర్ గారు ఎప్పుడు వస్తున్నారు? ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేయమంటారా? అని అడుగుతారన్నారు. అలా ఫ్లైట్ టిక్కెట్స్ కొనే కొందరు నిర్మాతలు బిచ్చగాళ్లగా మారారని పేర్కొన్నారు. అదే కోలీవుడ్‌లో దర్శకుడికి ప్లైట్ టిక్కెట్ ఇవ్వడానికి తెగ బాధ పడిపోతుంటారని అన్నారు. కార్యక్రమంలో హీరో నాగాన్వేషణ్, నటి హెబ్బాపటేల్, సీనియర్ దర్శకుడు వీసీ.గుహనాథన్, జాగ్వర్‌తంగం పాల్గొన్నారు.