నిర్మాతల పరిస్థితి దారుణం | Vinnaithandi Vantha Angel 's audio launch was held in Chennai on Wednesday. | Sakshi
Sakshi News home page

నిర్మాతల పరిస్థితి దారుణం

Published Thu, Jul 13 2017 1:37 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

నిర్మాతల పరిస్థితి దారుణం

నిర్మాతల పరిస్థితి దారుణం

తమిళసినిమా; తెలుగు సినీ నిర్మాతలు ప్‌లైట్‌ టిక్కెట్లు ఇచ్చే బిచ్చగాళ్లుగా మారారని సీనియర్‌ దర్శకుడు ఆర్‌వీ.ఉదయకుమార్‌ అన్నారు. ప్రముఖ తెలుగు నిర్మాత సిందూరపువ్వు కృష్ణారెడ్డి తాజాగా నిర్మిస్తున్న త్రిభాషా భారీ చిత్రం విన్నైతాండి వంద ఏంజల్‌. ఆయన కొడుకు నాగాన్వేషణ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా హెబ్బాపటేల్‌ కథానాయకిగా నటిస్తోంది. బాహుబలి చిత్రానికి రాజమౌళి వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన కే.పళని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి బీమ్స్‌ సినీరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ బుధవారం ఉదయం చెన్నైలో జరిగింది.
 
17 ఏళ్ల తరువాత.. చిత్ర నిర్మాత సిందూరపూవ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ 17 ఏళ్ల తరువాత మళ్లీ చెన్నై వచ్చానని అన్నారు. విన్నైతాండి వంద ఏంజల్‌ చిత్రం గురించి చెప్పాలంటే ఇది బాహుబలి చిత్రం తరహాలో సాగే సోషియో ఫాంటసీ, కామెడీ, లవ్‌ ఎంటర్‌టెయినర్‌ కథా చిత్రం అని తెలిపారు. ఇందులో సీజీ వర్క్‌ హైలెట్‌గా ఉంటుందన్నారు. దర్శకుడు బాహుబలి కే.పళని తనను కలిసి కథ చెప్పారన్నారు. ఈ చిత్రం తమిళంలోనూ బాగుంటుందని దర్శకుడు చెప్పడంతో ద్విభాషా చిత్రంగా చేయడానికి సిద్ధం అయ్యామని, ఆ తరువాత ముంబైకి చెందిన రుషేంద్రరెడ్డి అనే నిర్మాత చిత్రంలోని సీజీ వర్క్‌ను చూసి చిత్రానికి ఇంత ఖర్చు చేస్తున్నారు వర్కౌట్‌ అవుతుందా? అని అడిగారన్నారు. కథ డిమాండ్‌ మేరకు ఖర్చు పెడుతున్నామని చెప్పగా హిందీ వెర్షన్‌ హక్కులు తనకు ఇస్తారా?అని అడిగారన్నారు.అలా ఈ చిత్రం త్రిభాషా చిత్రం అయ్యిందని సిందూరపువ్వు కృష్ణారెడ్డి వివరించారు.

టాలీవుడ్‌లో మన వారికి గౌరవం అధికం
దర్శకుడు ఆర్‌వీ.ఉదయకుమార్‌ మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమలో తమిళ కళాకారులకు చాలా గౌరవం అని పేర్కొన్నారు. అంతటి గౌరవం ఇక్కడ లేదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభకు గుర్తింపునిస్తారని, సార్‌ డైరెక్టర్‌ గారు ఎప్పుడు వస్తున్నారు? ఫ్‌లైట్‌ టిక్కెట్‌ బుక్‌ చేయమంటారా? అని అడుగుతారన్నారు. అలా ఫ్‌లైట్‌ టిక్కెట్స్‌ కొనే కొందరు నిర్మాతలు బిచ్చగాళ్లగా మారారని పేర్కొన్నారు. అదే కోలీవుడ్‌లో దర్శకుడికి ప్‌లైట్‌ టిక్కెట్‌ ఇవ్వడానికి తెగ బాధ పడిపోతుంటారని అన్నారు. కార్యక్రమంలో హీరో నాగాన్వేషణ్, నటి హెబ్బాపటేల్, సీనియర్‌ దర్శకుడు వీసీ.గుహనాథన్, జాగ్వర్‌తంగం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement