కొత్త ఏంజిల్‌ | Payal Rajput Kollywood Entry With Angel | Sakshi
Sakshi News home page

కొత్త ఏంజిల్‌

Sep 23 2018 1:37 AM | Updated on Sep 23 2018 1:37 AM

Payal Rajput Kollywood Entry With Angel - Sakshi

పాయల్‌ రాజ్‌పుత్‌

అందంతో కుర్రకారును, నటనతో ప్రేక్షకుల మనసును దోచేశారు ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ సినిమా తర్వాత చాలా ఆఫర్లు ఈ పంజాబీ బ్యూటీ తలుపు తట్టాయి. కానీ మనసుకు నచ్చిన పాత్రలనే ఎంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారీ సొగసరి. అలా ఓ కథ నచ్చి కోలీవుడ్‌లో నటించడానికి పచ్చజెండా ఊపారామె. ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా కేఎస్‌ అదియమాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో ఒక హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌ ఎంపికయ్యారు.

ఈ సినిమాకు ‘ఏంజిల్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా ఆనంది నటిస్తారని టాక్‌. ఆల్రెడీ పాయల్‌ తన పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్‌ను స్టార్ట్‌ చేశారట. ఈ సంగతి ఇలా ఉంచితే.. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్‌ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో నర్తించనున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. మరోవైపు తెలుగులో హిట్‌ సాధించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ మూవీ తమిళంలో రీమేక్‌ కానుంది. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తారు. ఇందులో కథానాయికగా ఇంకా ఎంపిక కాలేదు. పాయల్‌నే తీసుకున్నా ఆశ్చర్యపోవడానికి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement