ఈక్విటీల్లో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలని భావించే వారు లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు పోర్ట్‌ఫోలియోలో చోటు కల్పించుకోవచ్చు. తమ రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ విభాగానికి ఎంత కేటాయింపులన్నవి తేల్చుకోవాలి. లార్జ్‌క్యాప్‌తో పోల్చిచూసినప్పుడు కొంత రిస్క్ అధికంగా ఉన్నప్పటికీ 10–20 ఏళ్ల కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అధిక రాబడులు ఇవ్వగలవు. మిడ్‌క్యాప్ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీస్ ఒకటి. దీర్ఘకాల లక్ష్యాల కోసం రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నవారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. మిడ్‌క్యాప్‌తోపాటు లార్జ్‌క్యాప్ పెట్టుబడులకూ ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది.
రాబడులు
ఈ పథకం దీర్ఘకాల పనితీరును గమనించినట్టయితే రాబడులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 38 శాతానికి పైగా ఉన్నాయంటే పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఐదేళ్లలో 27 శాతం, ఏడేళ్లలో 18.47 శాతం, పదేళ్లలో 18.84 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చి.. మిడ్‌క్యాప్ విభాగంలోని మెరుగైన పథకాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఏడాది, ఏడేళ్లు, పదేళ్ల కాలాల్లో బెంచ్‌మార్క్ సూచీ ‘బీఎస్‌ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్‌ఐ’ కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. 2007 మే నెలలో ఈ పథకం మొదలు కాగా, నాటి నుంచి చూస్తే వార్షిక సగటు రాబడి 15.75 శాతంగా ఉంది. ఈ పథకంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ (ఎక్స్‌పెన్స్ రేషియో) 1.43 శాతంగా ఉంది.
పెట్టుబడుల విధానం
కనీసం 65 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులను మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఈ పథకం నష్టాలను పరిమితం చేసింది. ఆ తర్వాతి ర్యాలీల్లో మెరుగైన రాబడులను ఇచ్చింది. వృద్ధికి అవకాశం ఉండి, అంతగా వెలుగులోకి రాని పటిష్టమైన కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పోర్ట్‌ఫోలియోలో వ్యాల్యూ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే కాదు.. తగిన రాబడులు ఇచ్చే వరకు ఆ పెట్టుబడులు కొనసాగిస్తుంటుంది.
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 50,627 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 96 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ పెట్టుబడులు 0.21 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 3.7 శాతంగా ఉన్నాయి. ఈక్విటీల్లో 40 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. 58 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్‌లకు కేటాయించింది. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 1.44 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 66 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్–10 కంపెనీల్లో పెట్టుబడులు 29 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో కాన్సంట్రేషన్ తక్కువ అని అర్థమవుతోంది. పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 78 శాతం పెట్టుబడులు ఈ రంగాల కంపెనీల్లోనే ఉన్నాయి.
టాప్ ఈక్విటీ హోల్డింగ్స్
కంపెనీ పెట్టుబడులు శాతం
పర్సిస్టెంట్ సిస్టమ్స్ 4.16
ఒరాకిల్ ఫిన్ 3.51
ఎంఫసిస్ 3.31
ఒబెరాయ్ రియల్టీ 3.11
ఫోర్టిస్ హల్త్‌కేర్ 3.05
ఇప్కా ల్యాబ్ 3.01
కోరమాండల్ 2.49
పీఐ ఇండస్ట్రీస్ 2.39
సోలార్ ఇండస్ట్రీస్ 2.23
సుప్రీమ్ ఇండస్ట్రీస్ 2.19
Comments
Please login to add a commentAdd a comment