ముంబై: కుమారమంగళం బిర్లా గ్రూపు కంపెనీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్.. స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ రీబాక్ మార్కెటింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తద్వారా స్పోర్ట్స్‌వేర్, లైఫ్‌స్టయిల్ వేర్ విభాగంలోకి ప్రవేశానికి వీలు కలిగింది. న్యూయార్క్‌కు చెందిన ఆథెంటిక్ బ్రాండ్ గ్రూపుతో దీర్ఘకాలిక లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రీబాక్ మార్కెటింగ్, బ్రాండింగ్ హక్కులను ఆథెంటిక్ బ్రాండ్ గ్రూపు ఇటీవలే సొంతం చేసుకోవడం గమనార్హం.
ఏషియా మార్కెట్‌లో
ఈ ఒప్పందం కింద భారత్‌తోపాటు, ఆసియాన్ దేశాల్లో మార్కెటింగ్, విక్రయ హక్కులు ఏబీ ఫ్యాషన్ అండ్ రిటైల్‌కు లభించనున్నాయి. ఆథెంటింక్ బ్రాండ్ గ్రూపుతో ఏబీ ఫ్యాషన్ అండ్ రిటైల్‌కు ఇప్పటికే వ్యాపార అనుబంధం ఉంది. ఆథెంటిక్ బ్రాండ్ గ్రూపునకు చెందిన ఫరెవర్ 21 మార్కెటింగ్ హక్కుల విషయంలో ఒప్పందం కొనసాగుతుండగా.. రీబాక్ బ్రాండ్ విషయంలోనూ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోనున్నాయి. అంతర్జాతీయంగా రీబాక్ బ్రాండ్ హక్కులు ఆదిదాస్ నుంచి ఆథెంటిక్ బ్రాండ్ గ్రూపునకు బదిలీ కానుండడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. కొన్ని షరతులకు లోబడి ఈ ఒప్పందం అమలు ఆధారపడి ఉంటుందని ఇరు సంస్థలు ప్రకటించాయి.
రీబాక్ ఆదాయం
గడిచిన రెండు దశాబ్దాల్లో భారత్‌లో రీబాక్ ఎంతో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నట్టు ఏబీ ఫ్యాషన్ అండ్ రిటైల్ ఎండీ అభిషేక్ దీక్షిత్ తెలిపారు. 2021 ఆర్థిక సంత్సరంలో రీబాక్ ఇండియా రూ.4.9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 93 శాతం తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment