Reebok
-
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
రీబాక్‌ను సొంతం చేసుకున్న ఇండియన్ కంపెనీ!
ముంబై: కుమారమంగళం బిర్లా గ్రూపు కంపెనీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్.. స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ రీబాక్ మార్కెటింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తద్వారా స్పోర్ట్స్‌వేర్, లైఫ్‌స్టయిల్ వేర్ విభాగంలోకి ప్రవేశానికి వీలు కలిగింది. న్యూయార్క్‌కు చెందిన ఆథెంటిక్ బ్రాండ్ గ్రూపుతో దీర్ఘకాలిక లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రీబాక్ మార్కెటింగ్, బ్రాండింగ్ హక్కులను ఆథెంటిక్ బ్రాండ్ గ్రూపు ఇటీవలే సొంతం చేసుకోవడం గమనార్హం. ఏషియా మార్కెట్లో ఈ ఒప్పందం కింద భారత్‌తోపాటు, ఆసియాన్ దేశాల్లో మార్కెటింగ్, విక్రయ హక్కులు ఏబీ ఫ్యాషన్ అండ్ రిటైల్‌కు లభించనున్నాయి. ఆథెంటింక్ బ్రాండ్ గ్రూపుతో ఏబీ ఫ్యాషన్ అండ్ రిటైల్‌కు ఇప్పటికే వ్యాపార అనుబంధం ఉంది. ఆథెంటిక్ బ్రాండ్ గ్రూపునకు చెందిన ఫరెవర్ 21 మార్కెటింగ్ హక్కుల విషయంలో ఒప్పందం కొనసాగుతుండగా.. రీబాక్ బ్రాండ్ విషయంలోనూ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోనున్నాయి. అంతర్జాతీయంగా రీబాక్ బ్రాండ్ హక్కులు ఆదిదాస్ నుంచి ఆథెంటిక్ బ్రాండ్ గ్రూపునకు బదిలీ కానుండడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. కొన్ని షరతులకు లోబడి ఈ ఒప్పందం అమలు ఆధారపడి ఉంటుందని ఇరు సంస్థలు ప్రకటించాయి. రీబాక్ ఆదాయం గడిచిన రెండు దశాబ్దాల్లో భారత్‌లో రీబాక్ ఎంతో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నట్టు ఏబీ ఫ్యాషన్ అండ్ రిటైల్ ఎండీ అభిషేక్ దీక్షిత్ తెలిపారు. 2021 ఆర్థిక సంత్సరంలో రీబాక్ ఇండియా రూ.4.9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 93 శాతం తగ్గింది. -
అమ్మకానికి రీబాక్.... ఆడిడాస్ సంచలన నిర్ణయం
స్పోర్ట్స్‌వేర్ ఉత్పత్తుల సంస్థ రీబాక్ అమ్మకానికి వచ్చింది. దాదాపు వందేళ్లకు పైబడి కొనసాగుతున్న ఈ ప్రముఖ బ్రాండ్ యాజమాన్యం మరోసారి మారనుంది. ఇందుకు సంబంధించిన చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. రీబాక్ బ్రాండ్ తెలియని యూత్, స్పోర్ట్స్ పర్సన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. దాదాపు నూట ఇరవై ఆరేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పాదరక్షలు, స్పోర్ట్స్ వేర్, ఫిట్నెస్ కేర్‌లో రీబాక్ బ్రాండ్ ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికా బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్బీఏతో రీబాక్కి ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ని 2.5 బిలియన్ డాలర్లకు అథెంటిక్ బ్రాండ్స్ గ్రూప్ (ఏబీజీ) సొంతం చేసుకోనుంది. రీబాక్ బ్రాండ్‌ని మరో ప్రముఖ స్పోర్ట్స్ వేర్ సంస్థ అడిడాస్ 2006లో 3.8 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. నైక్‌కి పోటీగా రీబాక్‌ను తీర్చిదిద్దేంకు ప్రయత్నించింది. అయితే ఆడిడాస్ చేతిలోకి వెళ్లిన తర్వాత రీబాక్ వ్యాపారం బాగా దెబ్బతింది. దీంతో ఆడిడాస్లోని ఇన్వెస్టర్లు రీబాక్‌ను అమ్మాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో రీబాక్ బ్రాండ్‌ను వదిలించుకునేందుకు అడిడాస్ సిద్ధమైంది. -
క్షమాపణ కోరిన ప్రముఖ ర్యాప్ సింగర్
న్యూఢిల్లీ: ప్రముఖ ర్యాప్ సింగర్ కార్డీ బీ హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు గాను క్షమాపణ కోరారు. ఓ ఫుట్‌వేర్ మ్యాగజైన్ కవర్ ఫోటోకి దుర్గా మాతా అవతారంలో పాదరక్షలు పట్టుకొని ఉన్న ఫోటో రావడంతో ఆమెపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేశారు. ఆమె హిందువుల సంప్రదాయాలను అగౌరవపరిచారని, మనోభావాలను దెబ్బ తిసేలా వ్యవహరించారన్నారు. రిబోక్ సంస్థతో ఉన్న ఒప్పందంలో భాగంగా కార్డీ బీ నవంబర్ నెలకు సంబంధించిన ఫుట్‌వేర్ న్యూస్ మ్యాగజైన్లో వివాదాస్పద ఫోటో కవర్ ఫోటోగా వచ్చింది. దీనిపై స్పందించిన కార్డీ బీ ఇన్స్టాగ్రామ్ ఓ పోస్ట్ చేశారు. ఇందులో ఆమె క్షమాపణ కోరుతూ, ఎవరి సంప్రదాయాలను కించపరచడం తన ఉద్ధేశ్యం కాదని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని తెలిపింది. తరువాత ఆమె ఆ పోస్ట్‌ను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించారు. దుర్గా మాతా ఫోటో వివాదంపై వివరణ ఇస్తూ ఈ షూట్ నిర్వహణలో డైరెక్టర్ తన పాత్ర.. మహిళకు శక్తి, విశ్వాసం, ధైర్యం పెంచే విధంగా ఉండాలని చెప్పారని మహిళల కోసం ఆలోచించే తనకు ఆ నిర్ణయం నచ్చే షూట్ చేశానని చెప్పారు. ఏ మతాన్ని కించపరిచేలా వ్యవహరించడం తన ఉద్దేశం కాదని ఆమె తెలిపారు. -
లీకైన ఆ వీడియో నిజమే: హీరోయిన్!
తెరమీద ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసే ఓ ప్రముఖ హీరోయిన్ నిజజీవితంలో కోప్పడితే ఎలా ఉంటుంది. షూటింగ్ సందర్భంగా తన సిబ్బందితో చిర్రుబుర్రులాడుతూ.. కోపంగా కాగితాలను విసిరేస్తే ఎలా అనిపిస్తుంది. అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల ఆన్లైన్లో లీకైంది. 'క్వీన్', 'తను వెడ్స్ మను' వంటి సినిమాలతో ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ వీడియోలో ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించింది. షూటింగ్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె కాగితాలను ఎదురుగా ఉన్న బల్లపై విసిరేయడం ఇందులో చూడొచ్చు. లీకైన ఈ వీడియో ఆన్లైన్లో హల్ చల్ చేస్తుండటంతో తాజాగా కంగనా ఈ వీడియో ప్రామాణికమైనదేనని వెల్లడించింది. 'ఫెమినా' మ్యాగజీన్ మార్చ్ ఎడిషన్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ అమ్మడు ఈ వీడియో నిజమేనని, తన పాత్రకు డూప్ పెట్టుకునే విషయంలో షూటింగ్ సిబ్బందిపై కోప్పడ్డానని ఆమె అంగీకరించింది. ' రీబక్ ప్రచారం కోసం నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నేను నా పాత్ర కోసం డూప్ పెట్టుకోవాలని భావించలేదు. ఆ విషయమై ఆ సంభాషణ జరిగింది' అని కంగనా వివరణ ఇచ్చింది. ఇబ్బంది లేకుండా ఉండేందుకు డూప్‌ను పెట్టుకోవాలని యూనిట్ సిబ్బంది ఒకరు కోరడంతో అతనిపై కంగనా ఒంటికాలిపై లేవడం ఈ లీకైన వీడియోలో వినిపిస్తుంది. 'నేను ఎందుకు డూప్‌ను పెట్టుకోవాలి. నేను డూప్‌ను పెట్టుకొని ఎప్పుడూ నటించను. నేనేం చేయాలో నాకు చెప్పొద్దు. డూప్ చేయగా నేను చేయలేనిది ఏముంది' అంటూ ఆగ్రహంగా ఆమె కాగితాలను ఎదురుగా ఉన్న బల్లకేసి కొట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో లీకవ్వడం పబ్లిసిటీ స్టంటేనని కొందరు కొట్టిపారేస్తుండగా మరికొందరు మాత్రం ఇలా లీక్ చేయడం సబబు కాదని అభిప్రాయపడుతున్నారు. -
వ్యాపారంపై యోగా ముద్ర
అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో వాణిజ్య, వ్యాపార సంస్థలు.. యోగాకు సంబంధించిన అనేక ఉత్పత్తులు, సేవలతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. యోగా నేర్పించే ఈ-గైడ్లు, చాపలు, ఆధునిక యోగా పరికరాలు, యోగా దుస్తులు వంటి 500 రకాలకు పైగా వస్తువులతో స్నాప్‌డీల్ ఇంటర్నెట్ విక్రయ సంస్థ యోగా స్టోర్‌ను ప్రారంభించింది. ఈ వారంలో 150 పైగా వస్తువులపై ప్రత్యేక రాయితీలు కూడా అందిస్తోంది. అలాగే.. ఆరోగ్య సేవలు అందించే వీఎల్సీసీ సంస్థ తన కేంద్రాలన్నింటిలో ఉచిత యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఫ్రీకల్చర్, రీబాక్ వంటి సంస్థలు యోగా టీ-షర్టులు, ఇతర దుస్తులను మార్కెట్లోకి తెచ్చాయి. ఈబే వెబ్సైట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్టోర్‌లో యోగా సీడీలు, డీవీడీలను విక్రయానికి పెట్టారు. ఇక యాత్రా.కామ్ వంటి ప్రయాణ వెబ్సైట్లు.. వినియోగదారుల కోసం ప్రత్యేక యోగా ప్యాకేజీలు ప్రకటించాయి. ఉత్తరాన హృషికేశ్, దక్షిణాన కోవళం వంటి ప్రాంతాల్లో మూడు నుంచి పది రోజుల యోగా విహార యాత్రల ప్యాకేజీలను ప్రకటించిన యాత్రా.కామ్.. కనీసం రూ. 30,000 నుంచి గరిష్టంగా రూ. 96,500 వరకూ ధరలు నిర్ణయించింది.