లీకైన ఆ వీడియో నిజమే: హీరోయిన్‌! | Kangana Ranaut accepts she lost her cool at crew member in leaked video | Sakshi
Sakshi News home page

లీకైన ఆ వీడియో నిజమే: హీరోయిన్‌!

Published Thu, Mar 10 2016 4:48 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

లీకైన ఆ వీడియో నిజమే: హీరోయిన్‌!

లీకైన ఆ వీడియో నిజమే: హీరోయిన్‌!

తెరమీద ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసే ఓ ప్రముఖ హీరోయిన్‌ నిజజీవితంలో కోప్పడితే ఎలా ఉంటుంది. షూటింగ్ సందర్భంగా తన సిబ్బందితో చిర్రుబుర్రులాడుతూ.. కోపంగా కాగితాలను విసిరేస్తే ఎలా అనిపిస్తుంది. అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల ఆన్‌లైన్‌లో లీకైంది. 'క్వీన్‌', 'తను వెడ్స్ మను' వంటి సినిమాలతో ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఈ వీడియోలో ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించింది. షూటింగ్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె కాగితాలను ఎదురుగా ఉన్న బల్లపై విసిరేయడం ఇందులో చూడొచ్చు. లీకైన ఈ వీడియో ఆన్‌లైన్‌లో హల్‌ చల్ చేస్తుండటంతో తాజాగా కంగనా ఈ వీడియో ప్రామాణికమైనదేనని వెల్లడించింది.

'ఫెమినా' మ్యాగజీన్‌ మార్చ్ ఎడిషన్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ అమ్మడు ఈ వీడియో నిజమేనని, తన పాత్రకు డూప్‌ పెట్టుకునే విషయంలో షూటింగ్ సిబ్బందిపై కోప్పడ్డానని ఆమె అంగీకరించింది. ' రీబక్‌ ప్రచారం కోసం నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నేను నా పాత్ర కోసం డూప్‌ పెట్టుకోవాలని భావించలేదు. ఆ విషయమై ఆ సంభాషణ జరిగింది' అని కంగనా వివరణ ఇచ్చింది.

ఇబ్బంది లేకుండా ఉండేందుకు డూప్‌ను పెట్టుకోవాలని యూనిట్ సిబ్బంది ఒకరు కోరడంతో అతనిపై కంగనా ఒంటికాలిపై లేవడం ఈ లీకైన వీడియోలో వినిపిస్తుంది. 'నేను ఎందుకు డూప్‌ను పెట్టుకోవాలి. నేను డూప్‌ను పెట్టుకొని ఎప్పుడూ నటించను. నేనేం చేయాలో నాకు  చెప్పొద్దు. డూప్‌ చేయగా నేను చేయలేనిది ఏముంది' అంటూ ఆగ్రహంగా ఆమె కాగితాలను ఎదురుగా ఉన్న బల్లకేసి కొట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో లీకవ్వడం పబ్లిసిటీ స్టంటేనని కొందరు కొట్టిపారేస్తుండగా మరికొందరు మాత్రం ఇలా లీక్ చేయడం సబబు కాదని అభిప్రాయపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement