Crew Member
-
రెండేళ్లలో 9000 మంది నియామకం
ఎయిరిండియా కార్యకలాపాలు విస్తరిస్తున్న క్రమంలో భారీగా ఉద్యోగులను చేర్చుకుంటున్నట్లు సంస్థ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. గడిచిన రెండేళ్లలో మొత్తం 9000 మందిని నియమించుకున్నామని చెప్పారు. అందులో క్రూ సిబ్బంది 5000 మంది ఉన్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విల్సన్ మాట్లాడుతూ..‘2023 ఆర్థిక సంవత్సరంలో 24 శాతంగా ఉన్న సంస్థ దేశీయ మార్కెట్ వాటా 2024లో 27 శాతానికి పెరిగింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ వాటా 21 శాతం నుంచి 24 శాతానికి చేరుకుంది. భవిష్యత్తులో ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ కార్యకలాపాలు పెరగనున్నాయి. గడిచిన రెండేళ్లలో 9000 మందిని నియమించకున్నాం. అందులో 5000 వేలమంది క్రూ సిబ్బంది ఉన్నారు. సిబ్బంది సగటు వయసు 54 సంవత్సరాల నుంచి 35 ఏళ్లకు తగ్గింది. సంస్థ ఐదేళ్ల ప్రణాళిక కోసం ప్రారంభించిన ‘విహాన్.ఏఐ’ రెండేళ్లు పూర్తి చేసుకుంది. దీనివల్ల గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయం 25 శాతం మెరుగుపడింది. నష్టం 50 శాతానికి పైగా తగ్గింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్ బ్యాటరీ బుల్లెట్‌ప్రూఫ్!‘67 నేరోబాడీ కలిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌ల క్యాబిన్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. 2025 మధ్యకాలం నాటికి సంస్థకు చెందిన ఇరుకైన బాడీ కలిగిన విమానాలను విశాలంగా మారుస్తాం. అందుకోసం ప్రతినెల మూడు నుంచి నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎంచుకోబుతున్నాం’ అని పేర్కొన్నారు. వినియోగదార్లలో విశ్వాసం పెంచేందుకు, కచ్చితమైన సమయపాలనపైనా దృష్టి సారించేందుకు 2022లో ఎయిరిండియా ‘విహాన్.ఏఐ’ను ఆవిష్కరించింది. చట్టపరమైన చిక్కులను తొలగించడంపై ఇది దృష్టి సారించింది. టేకాఫ్ దశలో భాగంగా పలు చర్యలను తీసుకుంటోంది. దీనిసాయంతో టాటా గ్రూప్ ఎయిర్ఫ్లీట్ నెట్‌వర్క్‌లో మార్పులు చేపడుతోంది. -
భోజనం చేస్తుండగా ప్లేట్లో ‘పాము తల’ ప్రత్యక్షం.. షాకింగ్ దృశ్యాలు వైరల్
Snake Head In Flight Meal, ఇస్తాంబుల్: భోజనం చేస్తున్న సమయంలో అందులో బల్లి బయటపడిన సంఘటనలు చాలానే చూశాం. కానీ, భోజనం చేస్తున్న సమయంలో ప్లేట్లో పాము తల కనిపిస్తే.. భయంతో వణికిపోతాం. అలాంటి అనుభవమే టర్కీకి చెందిన విమాన సంస్థలో పని చేస్తున్న సిబ్బందికి ఎదురైంది. విమానంలో అందించిన ఆహారం తింటుండగా అందులోని కూరలో పాము తలను చూసి హడలిపోయాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన జులై 21న జరిగినట్లు ఇండిపెండెంట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్‌ఎక్స్‌ప్రెస్ విమానంలో అందులోని సిబ్బందికి ఈ అనుభవం ఎదురైనట్లు పేర్కొంది. విమానంలో అందించిన ఆహారాన్ని తింటుండగా.. ఆలూ, ఇతర కూరగాయలతో చేసిన కూరలో పాము తల కనిపించినట్లు చెప్పాడు. ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో.. ఆహారం వడ్డించిన ప్లేట్ మధ్యలో చిన్న పాము తల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనను ఖండించారు ఎయిర్‌లైన్స్ ప్రతినిధి. ఆహార సరఫరాదారుతో కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ‘ముప్పై ఏళ్ల విమాన సేవల్లో ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సురక్షితమైన ప్రయాణాలను కల్పించటమే తమ లక్ష్యం.’ అని పేర్కొన్నారు. Severed snake head found in a Sunexpress in-flight meal. The flight was enroute to Düsseldorf from Ankara when a cabin crew member, who had eaten most of the meal, found it. Dead snails have previously appeared in the airline’s flight meals. A company providing catering suspended pic.twitter.com/nAgg2wSUIK — Handy Joe (@DidThatHurt2) July 26, 2022 మరోవైపు.. భోజనంలో పాము తల తమ ప్రాంతం నుంచే వచ్చిందనే వాదనలను తిరస్కరించింది కాంట్రాక్ట్ సంస్థ. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఏ ఒక్క వస్తువును వంటలో వేయలేదని పేర్కొంది. 280 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉడికించిన వంటలో.. తాజాగా ఉన్న పాము తల ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించింది? వంట వండిన తర్వాత దానిని వేసి ఉంటారని పేర్కొంది. ఇదీ చదవండి: ‘లిక్కర్ వద్దు.. గంజాయి ముద్దు’.. ఎమ్మెల్యే ఉచిత సలహా! -
20 గంటల షిఫ్ట్: ప్రముఖ టీవీ షో ఏఏడీ మృతి
ముంబై : ప్రముఖ క్రైం టీవీ షో ‘సావ్ధాన్ ఇండియా’ యూనిట్ సభ్యులు ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. శనివారం షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. ప్రమోద్ ‘సావ్ధాన్ ఇండియా’ షోకు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన టీవీ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ మధ్యాహ్నం 3.30 గంటల వరకు దాదాపు 20 గంటల పాటు షూటింగ్ జరిగింది. షూటింగ్ ముగిసిన తర్వాత ప్రమోద్ ఓ యూనిట్ సభ్యుడితో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ( హీరో సల్మాన్‌ఖాన్ గుర్రం పేరిట మోసం ) 4.30 గంటల ప్రాంతంలో బైక్ యాక్సిడెంట్‌కు గురై దానిపై ఉన్న ఇద్దరూ మృత్యువాతపడ్డారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రమోద్ బైక్ నడుపుతున్నాడు. 20 గంటల షిఫ్ట్‌తో ఒత్తిడికి గురవ్వటం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదం జరగటానికి గల సరైన కారణాలు తెలియరాలేదు. -
రజనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను బ్యాడ్ న్యూస్. రజనీకాంత్ రాబోయే తమిళ చిత్రం 'అన్నాట్టే' మరోసారి కరోనావైరస్ మహమ్మారి సెగ తగిలింది. కరోనా, లాక్డౌన్ ఆంక్షలతో దీర్ఘకాలంగా వాయిదా పడి, ఇటీవలే తిరిగి ప్రారంభమైన షూటింగ్‌కు మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఈ మూవీ సెట్లో కోవిడ్-19 కేసులు నమోదు కావడంతో అన్నాట్టే షూటింగ్ నిలిపివేశారు. యూనిట్లో ఏకంగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రజనీకాంత్‌కు సమీపంగా మెలిగిన సాంకేతిక సిబ్బందికి కరోనా సోకిందని, దీంతో ముందు జాగ్రత్తగా, షూటింగ్ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. ఈ కారణంగా రజనీ గురువారం చెన్నైకి తిరిగి వెళ్లనున్నారని భావిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ఇచ్చిన అనంతరం రజనీకాంత్, నయనతార తదితరులు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లనున్నారు. (రజనీ రాజకీయ పార్టీ పొంగల్‌కు పక్కా!) గత వారం రజనీకాంత్ తన కుమార్తె ఐశ్వర్యా ధనుష్‌తో కలిసి షూటింగ్ నిమిత్తం చార్టర్డ్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో డిసెంబర్ 14 న షూటింగ్ ప్రారంభమైంది. షెడ్యూల్ 45 రోజులు ఉండాల్సి ఉంది. ఇటీవలి కాలంలో రజనీకాంత్ కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యం, రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో వీలైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేయాలని యోచిస్తున్నారు. అన్నాట్టే షూటింగ్లో 40శాతం మిగిలి ఉందని, తాను రాజకీయాల్లోకి రాకముందే దీన్ని పూర్తి చేస్తానని రజనీకాంత్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా అన్నాట్టే తమిళనాడులోని లోతట్టు ప్రాంతాలలో గ్రామీణ నేపథ్యం ఉన్న కథగా తెరకెక్కుతోంది. సిరుతై శివ దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్భు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా, ఈ సంవత్సరం ప్రారంభంలో అన్నాట్టే షూటింగ్ నిరవధికంగా నిలిచిపోగా, సుమారు తొమ్మిది నెలల తరువాత, వారం క్రితం షూట్ తిరిగి ప్రారంభమైంది. ఇంతలోనే మరోసారి కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోవడం ఆయన అభిమానుల్లో ఆందోళన రేపింది. -
రూ.72 లక్షల జరిమానా.. జీవితకాల నిషేధం
లండన్: కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడమే కాక.. విమనా సిబ్బందిపై దాడి చేసినందుకు గాను ఓ యువతిపై జీవితకాలం విమానయానం చేయకూడదంటూ నిషేధం విధించారు. వివరాలు.. చ్లోయి హైనెస్(22) అనే యువతి గత నెల 22న తన బామ్మతో కలిసి యూకే నుంచి టర్కీకి ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో విమానం గాల్లో ఉండగా.. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తెరవడానికి, కాక్‌పిట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. అడ్డుకోబోయిన ఇద్దరు సిబ్బంది మీద దాడి చేసి వారిని గాయపర్చింది. ఆపడానికి ప్రయత్నించిన ప్రయాణికులపై కూడ దాడి చేసింది. ఈ విషయం గురించి సదరు విమానయాన సంస్థ సీఈవో మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఇలాంటి ప్రయాణికురాలిని ఇంతవరకూ చూడలేదు. ఆమె చూడ్డానికి చాలా చిన్నగా ఉంది. కానీ చాలా బలవంతురాలు. ఆమె తీరు చూస్తే.. మా మీద యాసిడ్ పొయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తోచింది. ఆమె సృష్టించిన బీభత్సం వల్ల విమానాన్ని వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. కానీ ఆమె చేసిన పనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఆమె ప్రవర్తన వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడటమే కాక.. డబ్బు కూడా వృథా అయ్యింది. ఆ మొత్తన్ని ఆమె నుంచి తిరిగి రాబడతాం. అందుకనే ఆమె మీద రూ. 72 లక్షల జరిమానాతో పాటు.. జీవితాంతం విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించామ’ని తెలిపాడు. -
విమానంలో కొలీగ్ చెంప చెళ్లుమనిపించాడు
ముంబై : వరుస వివాదాలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. ఎయిరిండియా క్యాబిన్‌కు చెందిన ఓ క్రూ సభ్యుడు, తన జూనియర్ కొలిగ్ చెంప చెల్లుమనిపించాడు. దీనికి గల కారణం ఆన్‌బోర్డులో ఉన్న శాకాహార ప్రయాణికుడికి, మాంసాహార భోజనం అందజేయడమే. ఈ సంఘటన న్యూడిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళే విమానంలో చోటు చేసుకుంది. మార్చి 17న ఈ సంఘటన చోటు చేసుకుందని, దీనిపై అంతర్గత విచారణ ప్రారంభించినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. కేబిన్ అటెండెంట్ అయిన అమ్మాయి పొరపాటున న్యూఢిల్లీ-ఫ్రాంక్ఫర్ట్ విమానంలోని బిజినెస్ క్లాస్ ప్రయాణికుడికి శాకాహార భోజనం బదులు మాంసాహార భోజనం అందించింది. ఈ పొరపాటును గుర్తించిన ప్రయాణికుడు, క్యాబిన్ సూపర్వైజర్కు సమాచారం అందించాడు. కానీ ఎలాంటి ఫిర్యాదును దాఖలు చేయలేదు. తర్వాత ఆ అమ్మాయి, ప్రయాణికుడి వద్దకు వెళ్లి క్షమాపణలు కూడా కోరింది. ఆ భోజనాన్ని మార్చి వేరే భోజనాన్ని అందించింది. కానీ మరోసారి క్రూ సూపర్వైజర్ ఈ పొరపాటును రచ్చరచ్చ చేసి, ఆ అమ్మాయి చెంప చెల్లుమనిపించాడు. కానీ దీనిపై ఏ మాత్రం ప్రతీకారం తీర్చుకోకుండా.. ఆ అమ్మాయి మొత్తం ఘటనపై ఎయిరిండియా ఇన్‌ఫ్లైట్ సర్వీసు డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసింది. తమకు న్యూఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్లే విమానం ఏఐ 121 కేబిన్ క్రూ నుంచి ఫిర్యాదు అందిందని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. -
అవాక్కు.. ఫ్లైట్ ఉద్యోగిని బ్యాగులో రూ.3.21కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ మహిళా ఉద్యోగినిని ఢిల్లీ అధికారులు అరెస్టు చేశారు. అక్రమంగా రూ.మూడు కోట్ల విలువైన అమెరికా డాలర్లను పట్టుకెళుతున్న ఆమెను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హాంకాంగ్‌కు చెందిన జెట్ ఎయిర్వేస్ విమానం సోమవారం రాత్రి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. డీఆర్ఐ అధికారులు ఆ సమయంలో తనిఖీ చేయగా జెట్ ఎయిర్వేస్ సిబ్బందిలోని ఒకరి వద్ద ఉన్న సూట్ కేసులో రూ.3.21కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు లభించాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుపై లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. -
లీకైన ఆ వీడియో నిజమే: హీరోయిన్!
తెరమీద ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసే ఓ ప్రముఖ హీరోయిన్ నిజజీవితంలో కోప్పడితే ఎలా ఉంటుంది. షూటింగ్ సందర్భంగా తన సిబ్బందితో చిర్రుబుర్రులాడుతూ.. కోపంగా కాగితాలను విసిరేస్తే ఎలా అనిపిస్తుంది. అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల ఆన్లైన్లో లీకైంది. 'క్వీన్', 'తను వెడ్స్ మను' వంటి సినిమాలతో ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ వీడియోలో ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించింది. షూటింగ్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె కాగితాలను ఎదురుగా ఉన్న బల్లపై విసిరేయడం ఇందులో చూడొచ్చు. లీకైన ఈ వీడియో ఆన్లైన్లో హల్ చల్ చేస్తుండటంతో తాజాగా కంగనా ఈ వీడియో ప్రామాణికమైనదేనని వెల్లడించింది. 'ఫెమినా' మ్యాగజీన్ మార్చ్ ఎడిషన్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ అమ్మడు ఈ వీడియో నిజమేనని, తన పాత్రకు డూప్ పెట్టుకునే విషయంలో షూటింగ్ సిబ్బందిపై కోప్పడ్డానని ఆమె అంగీకరించింది. ' రీబక్ ప్రచారం కోసం నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నేను నా పాత్ర కోసం డూప్ పెట్టుకోవాలని భావించలేదు. ఆ విషయమై ఆ సంభాషణ జరిగింది' అని కంగనా వివరణ ఇచ్చింది. ఇబ్బంది లేకుండా ఉండేందుకు డూప్‌ను పెట్టుకోవాలని యూనిట్ సిబ్బంది ఒకరు కోరడంతో అతనిపై కంగనా ఒంటికాలిపై లేవడం ఈ లీకైన వీడియోలో వినిపిస్తుంది. 'నేను ఎందుకు డూప్‌ను పెట్టుకోవాలి. నేను డూప్‌ను పెట్టుకొని ఎప్పుడూ నటించను. నేనేం చేయాలో నాకు చెప్పొద్దు. డూప్ చేయగా నేను చేయలేనిది ఏముంది' అంటూ ఆగ్రహంగా ఆమె కాగితాలను ఎదురుగా ఉన్న బల్లకేసి కొట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో లీకవ్వడం పబ్లిసిటీ స్టంటేనని కొందరు కొట్టిపారేస్తుండగా మరికొందరు మాత్రం ఇలా లీక్ చేయడం సబబు కాదని అభిప్రాయపడుతున్నారు. -
నకిలీ నోట్లు తరలిస్తూ.. పట్టుబడ్డ విమాన సిబ్బంది
ముంబై: జెట్ ఎయిర్వేస్ విమానయాన సిబ్బంది భారీ మొత్తంలో నకిలీ కరెన్సీతో పట్టుబడ్డారు. బ్యాంకాక్ నుంచి ముంబై వచ్చిన జెట్ ఎయిర్ వేస్ విమానంలో రూ. 2.6 కోట్ల నకిలీ కరెన్సీని తరలిస్తూ ఎయిర్ పోర్టులో దొరికి పోయారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ సంఘటనలో పట్టుబడ్డ వారి విషయంలో సంస్థ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జెట్ ఎయిర్ వేస్ అధికారులు తెలిపారు. ఇంతకు ముందు కూడా జెట్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థకు చెందిన సిబ్బంది ఇలాంటి సంఘటనల్లో దొరికారు. జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది 2015 ముందు వరకు మొత్తం 20 సార్లు స్మగ్లింగ్ చేస్తూ దొరికారు. -
బంగారంతో పట్టుబడ్డ విమాన సిబ్బంది
సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది ఒకరు అడ్డంగా దొరికిపోయిన ఘటన సంచలనం రేపింది. తనిఖీల అనంతరం ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న సౌదీ పోలసులు.. శుక్రవారం కూడా విచారిస్తున్నారు. ఈ అరెస్టుతో కేవలం 11 మంది సిబ్బందితో మాత్రమే కొచి- జెడ్డా విమాన సర్వీసును నడిపించారు. నిబంధనల ప్రకారం విమానంలో 12 మంది సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారలు ఆలస్యంగా స్పందించారు. క్యాబిన్ క్రూలో ఒకరిని జెడ్డా ఎయిర్ పోర్టు అధికారులు అరెస్టుచేసింది నిజమేనని, అందుకు గల సహేతుక కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నామని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం మీడియాకు చెప్పారు. ఉద్యోగి తప్పుచేసినట్లు తేలితే విధుల నుంచి తొలిగిస్తామని పేర్కొన్నారు.