
ప్రమోద్
ముంబై : ప్రముఖ క్రైం టీవీ షో ‘సావ్‌ధాన్ ఇండియా’ యూనిట్ సభ్యులు ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. శనివారం షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. ప్రమోద్ ‘సావ్‌ధాన్ ఇండియా’ షోకు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన టీవీ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ మధ్యాహ్నం 3.30 గంటల వరకు దాదాపు 20 గంటల పాటు షూటింగ్ జరిగింది. షూటింగ్ ముగిసిన తర్వాత ప్రమోద్ ఓ యూనిట్ సభ్యుడితో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ( హీరో సల్మాన్‌ఖాన్ గుర్రం పేరిట మోసం )
4.30 గంటల ప్రాంతంలో బైక్ యాక్సిడెంట్‌కు గురై దానిపై ఉన్న ఇద్దరూ మృత్యువాతపడ్డారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రమోద్ బైక్ నడుపుతున్నాడు. 20 గంటల షిఫ్ట్‌తో ఒత్తిడికి గురవ్వటం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదం జరగటానికి గల సరైన కారణాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment