నకిలీ నోట్లు తరలిస్తూ.. పట్టుబడ్డ విమాన సిబ్బంది | Jet Airways crew member arrested trying to smuggle fake currency | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్లు తరలిస్తూ.. పట్టుబడ్డ విమాన సిబ్బంది

Published Thu, Feb 4 2016 7:05 PM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM

నకిలీ నోట్లు తరలిస్తూ.. పట్టుబడ్డ విమాన సిబ్బంది - Sakshi

నకిలీ నోట్లు తరలిస్తూ.. పట్టుబడ్డ విమాన సిబ్బంది

ముంబై: జెట్ ఎయిర్వేస్ విమానయాన సిబ్బంది భారీ మొత్తంలో నకిలీ కరెన్సీతో పట్టుబడ్డారు. బ్యాంకాక్ నుంచి ముంబై వచ్చిన జెట్ ఎయిర్ వేస్ విమానంలో రూ. 2.6 కోట్ల నకిలీ కరెన్సీని తరలిస్తూ ఎయిర్ పోర్టులో దొరికి పోయారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఈ సంఘటనలో పట్టుబడ్డ వారి విషయంలో సంస్థ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జెట్ ఎయిర్ వేస్ అధికారులు తెలిపారు. ఇంతకు ముందు కూడా జెట్ ఎయిర్ వేస్‌ విమానయాన సంస్థకు చెందిన సిబ్బంది ఇలాంటి సంఘటనల్లో దొరికారు. జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది 2015 ముందు వరకు మొత్తం 20 సార్లు స్మగ్లింగ్ చేస్తూ దొరికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement