న్యూఢిల్లీ: ప్రముఖ ర్యాప్ సింగర్ కార్డీ బీ హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు గాను క్షమాపణ కోరారు. ఓ ఫుట్‌వేర్ మ్యాగజైన్ కవర్ ఫోటోకి దుర్గా మాతా అవతారంలో పాదరక్షలు పట్టుకొని ఉన్న ఫోటో రావడంతో ఆమెపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేశారు. ఆమె హిందువుల సంప్రదాయాలను అగౌరవపరిచారని, మనోభావాలను దెబ్బ తిసేలా వ్యవహరించారన్నారు. రిబోక్ సంస్థతో ఉన్న ఒప్పందంలో భాగంగా కార్డీ బీ నవంబర్ నెలకు సంబంధించిన ఫుట్‌వేర్ న్యూస్ మ్యాగజైన్‌లో వివాదాస్పద ఫోటో కవర్ ఫోటోగా వచ్చింది.
దీనిపై స్పందించిన కార్డీ బీ ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ చేశారు. ఇందులో ఆమె క్షమాపణ కోరుతూ, ఎవరి సంప్రదాయాలను కించపరచడం తన ఉద్ధేశ్యం కాదని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని తెలిపింది. తరువాత ఆమె ఆ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించారు. దుర్గా మాతా ఫోటో వివాదంపై వివరణ ఇస్తూ ఈ షూట్ నిర్వహణలో డైరెక్టర్ తన పాత్ర.. మహిళకు శక్తి, విశ్వాసం, ధైర్యం పెంచే విధంగా ఉండాలని చెప్పారని మహిళల కోసం ఆలోచించే తనకు ఆ నిర్ణయం నచ్చే షూట్ చేశానని చెప్పారు. ఏ మతాన్ని కించపరిచేలా వ్యవహరించడం తన ఉద్దేశం కాదని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment