Cardi B
-
అభిమానిపై ప్రముఖ ర్యాపర్ ఫైర్.. మైక్ విసిరి.. బూతులు తిడుతూ..
ప్రముఖ ర్యాపర్ కార్జీ బీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ మ్యూజిక్ షోలో పాట పాడుతుండగా.. ఓ వ్యక్తి ఆమెపై డ్రింక్ బాటిల్‌ను విసిరాడు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై బూతులు తిడుతూ మైక్‌ను విసిరింది. 'ఐ లైక్ ఇట్' పాటకు మూమెంట్స్ ఇస్తూ వేదికపై కార్డీ బీ ఉత్సాహంగా పాట పాడుతున్నారు. ఈ క్రమంలో స్టేజ్ కింద నుంచి ఓ వ్యక్తి డ్రింక్ బాటిల్‌ను ఆమెపై విసిరాడు. కోపంతో ఊగిపోయిన కార్డీ బీ.. అతనిపై మైక్ విసిరింది. ఈ వీడియోను ర్యాపర్ సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. Jealous Ass Bitch! https://t.co/bPikhCYBYx pic.twitter.com/AUoG7pvtCv — Cardi B | Updates (@updatesofcardi) July 30, 2023 కార్జీ బీ చేసిన పనికి ఆమెను మెచ్చుకున్నారు కొంతమంది నెటిజన్లు. ఫ్యాన్సు అతి చేయకూడదని సూచనలు చేశారు. పర్ఫార్మర్లపై అలా చేస్తే ప్రోగ్రామ్ దెబ్బతింటుందని కామెంట్లు పెట్టారు. ఇందులో కార్జీ బీ చేసిన పనిని నిందించకూడదని అన్నారు. మ్యూజిక్ ప్రోగ్రామ్‌లలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. డ్రేక్, బెబే రెక్ష, కెల్సియా బాలేరిని, అవా మాక్స్‌లకు కూడా ఫ్యాన్స్ నుంచి ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి. ఇదీ చదవండి: కోతి పిల్లను అక్కున చేర్చుకున్న పిల్లి.. ఏదేమైనా మథర్ ఈజ్ గ్రేట్..! వీడియో వైరల్.. -
క్షమాపణ కోరిన ప్రముఖ ర్యాప్ సింగర్
న్యూఢిల్లీ: ప్రముఖ ర్యాప్ సింగర్ కార్డీ బీ హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు గాను క్షమాపణ కోరారు. ఓ ఫుట్‌వేర్ మ్యాగజైన్ కవర్ ఫోటోకి దుర్గా మాతా అవతారంలో పాదరక్షలు పట్టుకొని ఉన్న ఫోటో రావడంతో ఆమెపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేశారు. ఆమె హిందువుల సంప్రదాయాలను అగౌరవపరిచారని, మనోభావాలను దెబ్బ తిసేలా వ్యవహరించారన్నారు. రిబోక్ సంస్థతో ఉన్న ఒప్పందంలో భాగంగా కార్డీ బీ నవంబర్ నెలకు సంబంధించిన ఫుట్‌వేర్ న్యూస్ మ్యాగజైన్లో వివాదాస్పద ఫోటో కవర్ ఫోటోగా వచ్చింది. దీనిపై స్పందించిన కార్డీ బీ ఇన్స్టాగ్రామ్ ఓ పోస్ట్ చేశారు. ఇందులో ఆమె క్షమాపణ కోరుతూ, ఎవరి సంప్రదాయాలను కించపరచడం తన ఉద్ధేశ్యం కాదని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని తెలిపింది. తరువాత ఆమె ఆ పోస్ట్‌ను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించారు. దుర్గా మాతా ఫోటో వివాదంపై వివరణ ఇస్తూ ఈ షూట్ నిర్వహణలో డైరెక్టర్ తన పాత్ర.. మహిళకు శక్తి, విశ్వాసం, ధైర్యం పెంచే విధంగా ఉండాలని చెప్పారని మహిళల కోసం ఆలోచించే తనకు ఆ నిర్ణయం నచ్చే షూట్ చేశానని చెప్పారు. ఏ మతాన్ని కించపరిచేలా వ్యవహరించడం తన ఉద్దేశం కాదని ఆమె తెలిపారు. -
సింగర్ ప్రెగ్నెన్సీ నిజమే.. త్వరలో పెళ్లి!
లాస్ ఏంజిల్స్ : అమెరికన్ పాప్ సింగర్, యువ సంచలనం కార్డీ బి ప్రెగ్నెన్సీ వదంతులపై శనివారం ఓ క్లారిటీ వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆమె తొలి బిడ్డకు జన్మనివ్వనుందని, గర్భం దాల్చిందని ప్రచారం కాగా, అందులో వాస్తవం లేదంటూ సింగర్ కొట్టిపారేశారు. అయితే శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని బీ కేర్‌ఫుల్ అంటూ పాడిన పాడకు విశేష స్పందన వస్తోంది. అంతకంటే ఎక్కువగా ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వడం. ఆమె గర్బం ధరించినట్లు తెలియకుండా చేయాలని చేసిన యత్నం సఫలం కాలేదు. తొలుత కాస్త ఇబ్బంది పడ్డా స్టేజీపై పాడ పాడుతుంటే ఆమె గర్భం దాల్చినట్లు లైవ్ షో చూసిన వాళ్లు గుర్తించి సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మొదలుపెట్టేశారు. ఈవెంట్ ముగిశాక గత కొన్ని నెలలుగా ఆమెతో సహజీవనం చేస్తున్న ఆఫ్సెట్ ఈ శుభవార్తను ట్వీట్ ద్వారా షేర్ చేసుకున్నారు. కార్డీ బి, నేను కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నామని, తాము ఎంతో సంతోషంగా ఉన్నట్లు పోస్ట్ చేశారు. సింగర్ తొలిసారి తల్లి అవుతుండగా, ఆఫ్సెట్ నాలుగోసారి తండ్రి కానున్నారు. మాజీ భార్యతో అతడికి ముగ్గురు సంతానం ఉన్న విషయం తెలిసిందే. కార్డీ బి, ఆఫ్సెట్లు త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.