
ప్రముఖ ర్యాపర్ కార్జీ బీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ మ్యూజిక్ షోలో పాట పాడుతుండగా.. ఓ వ్యక్తి ఆమెపై డ్రింక్ బాటిల్‌ను విసిరాడు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై బూతులు తిడుతూ మైక్‌ను విసిరింది.
'ఐ లైక్ ఇట్' పాటకు మూమెంట్స్ ఇస్తూ వేదికపై కార్డీ బీ ఉత్సాహంగా పాట పాడుతున్నారు. ఈ క్రమంలో స్టేజ్ కింద నుంచి ఓ వ‍్యక్తి డ్రింక్ బాటిల్‌ను ఆమెపై విసిరాడు. కోపంతో ఊగిపోయిన కార్డీ బీ.. అతనిపై మైక్ విసిరింది. ఈ వీడియోను ర్యాపర్ సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
Jealous Ass Bitch! https://t.co/bPikhCYBYx pic.twitter.com/AUoG7pvtCv
— Cardi B | Updates (@updatesofcardi) July 30, 2023
కార్జీ బీ చేసిన పనికి ఆమెను మెచ్చుకున్నారు కొంతమంది నెటిజన్లు. ఫ్యాన్సు అతి చేయకూడదని సూచనలు చేశారు. పర్‌ఫార్మర్లపై అలా చేస్తే ప్రోగ్రామ్ దెబ్బతింటుందని కామెంట్లు పెట్టారు. ఇందులో కార్జీ బీ చేసిన పనిని నిందించకూడదని అన్నారు.
మ్యూజిక్ ప్రోగ్రామ్‌లలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. డ్రేక్, బెబే రెక్ష, కెల్సియా బాలేరిని, అవా మాక్స్‌లకు కూడా ఫ్యాన్స్ నుంచి ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి.
ఇదీ చదవండి: కోతి పిల్లను అక్కున చేర్చుకున్న పిల్లి.. ఏదేమైనా మథర్ ఈజ్ గ్రేట్..! వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment