Rap music
-
రవిశంకర్ రాజు టూ మాస్ మహారాజా: ఇరగదీశాడు భయ్యా!
#EagleRavitejarapsongintelugu టాలీవుడ్ హీరో రవితేజ్ గా వస్తున్న మూవీ ఈగల్. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో తెలుగు కుర్రోడు దుమ్ము రేపాడు. తెలుగులో ర్యాప్ మ్యూజిక్‌తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవిశంకర్ రాజు నుండి మాస్ మహారాజా రవితేజ వరకు సాగిన ప్రయాణాన్ని ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఉర్రూత లూగించింది. అంతేకాదు అద్భుతమైన RAP పాటకు రవితేజ కూడా ఫిదా అయిపోయాడు. ఉత్సాహంగా ఊగిపోయాడు. అదేంటో మీరు కూడా ఒకసారి చూసేయండి. కాగా మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితేజ్ నటిస్తున్న మూవీ ఈగల్. ధమాకా తర్వాత మరో మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలొ అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. -
Yohani: నా మదిలో మంట రేపావురా
100 మిలియన్ వ్యూస్ సాంగ్/ మాణికె మగే హితే ఒక సింహళగీతం మొన్నటి మే నెలాఖరున విడుదలైంది. సెప్టెంబర్‌కు ప్రపంచమంతా కలిసి వంద మిలియన్ల వ్యూస్‌తో నెటిజన్లు చూశారు. కుర్రకారు పదే పదే ఆ పాట పాడుతున్నారు. ఔత్సాహికులు తమ భాషలో ఆ పాటను రికార్డు చేస్తున్నారు. ఒరిజినల్ సింహళమే అయినా అనేక భారతీయ భాషల్లో అది డబ్ అయ్యింది. 28 ఏళ్ల ర్యాప్ సింగర్ యోహనీ ఈ సెన్సేషన్‌కు కారణం. ఆమె గొంతులో ఏదో ఉంది. ఆ ఏదో ఏమిటనేదాని కోసం కోట్ల మంది ఆ పాటను వింటూనే ఉన్నారు. ఏమిటి ఆ పాట... ఎవ్వరు ఆ గాయని? మాణికె మగే హితే ముదువే నూరా హంగుమ్ యావీ.. అవిలేవీ... ఇదీ ఆ పాట పల్లవి. దీని అర్థం ‘నా మదిలో ఎప్పుడూ నీ తలంపే... మోహజ్వాలలా రగులుతూ ఉంటుంది’ అని అర్థం. యోహనీ ఆ పాటను పాడిన తీరు దానికి కో సింగర్ సతీషన్ గొంతు కలపడం... ఏదో మేజిక్ జరిగింది. అది ఇప్పుడు జగాన్ని ఊపుతోంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై తెగ వైరల్ అవుతున్న పాట ఇది. గతంలో ఒక సింగర్‌కు గుర్తింపు రావాలంటే ఎన్నో పాటలు పాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక్క సరైన పాట పాడితే రాత్రికి రాత్రి స్టార్‌ని చేసేస్తోంది. యోహని అలా ఇప్పుడు శ్రీలంకకు బయట స్టార్ అయ్యింది. చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టపడే యోహనీ సింగింగ్నే కెరియర్‌గా ఎంచుకుని ఇప్పుడు ఈ పాటతో ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. శ్రీలంక కోయిల 1993 జూలై 30న కొలంబోలో మేజర్ జనరల్ ప్రసన్న డిసిల్వా, దినితి డిసిల్వాలకు పుట్టింది యోహని. ఈమెకు ఒక చెల్లెలు ఉంది. తండ్రి ఆర్మీ అధికారి, తల్లి ఎయిర్ హోస్టెస్ కావడంతో చిన్నతనంలో శ్రీలంకతోపాటు మలేసియా, బంగ్లాదేశ్‌లలో పెరిగింది. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్లో డిగ్రీ అయ్యాక అక్లాడే కంపెనీలో మేనేజర్‌గా చేరింది. ఇక్కడ ఏడాది పనిచేశాక మెల్బోర్న్ వెళ్లి క్వీన్స్లాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. యోహనీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఎనలేని అభిమానం. ఆ ఆసక్తిని గమనించిన తల్లి ఆ దిశగా ప్రోత్సహించడంతో ర్యాప్, పాప్, క్లాసికల్ సాంగ్స్‌ను పాడడం నేర్చుకుంది. పెట్టా ఎఫ్ట్కెట్ లేబుల్ రికార్డింగ్‌తో కలిసి ‘ఆయే’ పాటను పాడి సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ర్యాప్ ప్రిన్సెస్... 2016లో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించి కవర్ సాంగ్స్ వీడియోలను అప్లోడ్ చేసేది. వాటికి మంచి స్పందన లభించడంతో తనే స్వయంగా పాడిన పాటలను విడుదల చేసింది. ‘దేవియాంజే బరే’ అనే ర్యాప్ పాటంతో యోహనీకి సింగర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ఆమె తన యూట్యూబ్ చానల్లో అనేక పాటలను విడుదల చేసింది. వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో పాపులర్ బ్యాండ్స్‌తో కలసి మ్యూజిక్ షోలలో పాల్గొనేది. తరువాత తమిళ పాటలు పాడుతూ బాగా ఫేమస్ అయ్యింది. దీంతో ‘ర్యాప్ ప్రిన్సెస్ ఆఫ్ శ్రీలంక టైటిల్’ను గెలుచుకుంది. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క తనకెంతో ఇష్టమైన పాటలు పాడుతూ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుండేది. దీంతో యోహనీ పాటలు ఒక్క శ్రీలంకలోనేగాక ఇండియా, బంగ్లాదేశ్, మలేషియాల్లో కూడా బాగా వైరల్ అయ్యేవి. 20 లక్షల సబ్‌స్క్రయిబర్స్ ఉన్న ఏకైక శ్రీలంక గాయనిగా రికార్డు స్థాపించింది. సింగిల్‌గా పాడిన పాటలేగాక సితా దౌవున, హాల్ మాస్సా వియోలే, యావే, ఆయితే వారాక్ వంటి ఆల్బమ్స్ కూడా చేసింది. వివిధ వేదికలు, సెమినార్లలో లైవ్ పెర్ఫార్మ్స్ కూడా ఇచ్చింది. గాయనిగానే కాక పాటల రచయిత, మ్యూజిక్ ప్రొడ్యూసర్, వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ‘ర్యాప్ ప్రిన్సెస్ ఆఫ్ శ్రీలంక’ అయ్యాక శ్రీలంకలోనే పాపులర్ సింగర్స్‌తో కలిసి పనిచేసింది. యోహని పాడిన పాటల్లో ఒక పాట ‘బెస్ట్ వీడియో రీమేక్’ అవార్డును గెలుచుకుంది. ఇవేగాక రెడ్‌బుల్ నిర్వహించే కన్సర్ట్లలో ఆమె పాల్గొనడం విశేషం. యోహనీ పాడిన పాటల్లో మాణికే మాగే హితే, యోహనీ మెర్రి క్రిస్టమస్ బేబీ, లా రోజ్ ఎట్లెపైన్ వాల్యూమ్–1, నలుమ్బనయా, హాల్ మస్సా వయోలే వయోలే, నషక్షాలే, బుల్మా పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మాణికే మగే హితే.. యోహనీ, సతీషన్ కలిసి పాడిన ఈ పాటను సెప్టెంబర్‌లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ యష్‌రాజ్ ముఖతే ఇన్‌స్టాలో పోస్టు చేసిన వెంటనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. తరువాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ సాంగ్ బీట్‌కు కాలు కదిపినట్లుగా స్పూఫ్ వీడియో చేశారు. అప్పటి నుంచి ఈ పాట బాగా వైరల్ అయ్యింది. ఇటీవల ఖాళీగా ఉన్న విమానంలో ఎయిర్ హోస్టెస్ ‘మాణికే మగే హితే’కు డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేయడంతో విపరీతంగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ‘మాణికే మగే హితే’ పాట వంద మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది. యోహనీకి ఇన్‌స్ట్రాగామ్‌లో ఐదులక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉండడం విశేషం. మీరు ఇప్పటి వరకూ ఈ పాట వినకపోతే వినండి. మళ్లీ వింటారు. -
క్షమాపణ కోరిన ప్రముఖ ర్యాప్ సింగర్
న్యూఢిల్లీ: ప్రముఖ ర్యాప్ సింగర్ కార్డీ బీ హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు గాను క్షమాపణ కోరారు. ఓ ఫుట్‌వేర్ మ్యాగజైన్ కవర్ ఫోటోకి దుర్గా మాతా అవతారంలో పాదరక్షలు పట్టుకొని ఉన్న ఫోటో రావడంతో ఆమెపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేశారు. ఆమె హిందువుల సంప్రదాయాలను అగౌరవపరిచారని, మనోభావాలను దెబ్బ తిసేలా వ్యవహరించారన్నారు. రిబోక్ సంస్థతో ఉన్న ఒప్పందంలో భాగంగా కార్డీ బీ నవంబర్ నెలకు సంబంధించిన ఫుట్‌వేర్ న్యూస్ మ్యాగజైన్లో వివాదాస్పద ఫోటో కవర్ ఫోటోగా వచ్చింది. దీనిపై స్పందించిన కార్డీ బీ ఇన్స్టాగ్రామ్ ఓ పోస్ట్ చేశారు. ఇందులో ఆమె క్షమాపణ కోరుతూ, ఎవరి సంప్రదాయాలను కించపరచడం తన ఉద్ధేశ్యం కాదని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని తెలిపింది. తరువాత ఆమె ఆ పోస్ట్‌ను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించారు. దుర్గా మాతా ఫోటో వివాదంపై వివరణ ఇస్తూ ఈ షూట్ నిర్వహణలో డైరెక్టర్ తన పాత్ర.. మహిళకు శక్తి, విశ్వాసం, ధైర్యం పెంచే విధంగా ఉండాలని చెప్పారని మహిళల కోసం ఆలోచించే తనకు ఆ నిర్ణయం నచ్చే షూట్ చేశానని చెప్పారు. ఏ మతాన్ని కించపరిచేలా వ్యవహరించడం తన ఉద్దేశం కాదని ఆమె తెలిపారు. -
సవాల్ విసిరిన సచిన్.. వారం రోజులే గడువు!
ముంబై: లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఆప్త మిత్రుడు వినోద్ కాంబ్లికి ఓ సవాల్ విసిరాడు. అంతేకాకుండా ఆ చాలెంజ్‌ను కేవలం ఏడు రోజుల్లో పూర్తి చేయాలని మరో మెలిక పెట్టాడు. అయితే సచిన్ సవాల్‌ను కాంబ్లి స్వీకరించాడు. వారం రోజుల్లో సచిన్ చెప్పిన పనిని పూర్తి చేస్తానని కాంబ్లి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ ఆ చాలెంజ్ ఏంటంటే.. గతంలో బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌తో కలిసి సచిన్ 'క్రికెట్ వాలీ బీట్ పే' అనే సాంగ్‌ను పాడిన విషయం తెలిసిందే. అయితే ఆ పాటకు కేవలం ఏడు రోజుల్లో ర్యాప్ చేయాలని కాంబ్లికి సచిన్ సవాల్ విసిరాడు. ఈనెల 28 లోపూ ‘క్రికెట్ వాలీ బీట్ పే’కు ర్యాప్ సాంగ్ పాడకుంటే కాంబ్లి తనకు ఏదో రుణపడి ఉంటాడని సచిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వీర్దిదరి సంభాషణలకు సంబంధించిన వీడియోను సచిన్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక 2017లో 'క్రికెట్ వాలీ బీట్ పే' సాంగ్ క్రికెట్ అభిమానులతో పాటు సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సాంగ్‌ను టీమిండియా తరుపున ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లకు అంకితమిస్తున్నట్టు సచిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, స్కూల్ క్రికెట్లో సచిన్-కాంబ్లిలు 664 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి అప్పట్లో చరిత్ర సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. Mr. Kambli, I challenge you to do the rap of my song #CricketWaliBeat! You have 1 week. 😜 @vinodkambli349 pic.twitter.com/8zU1tVG0mh — Sachin Tendulkar (@sachin_rt) January 21, 2020 చదవండి: వడా పావ్ ఎలా తినాలో చెప్పిన సచిన్ ధావన్ స్థానంలో పృథ్వీ షా -
రానా థ్రిల్లింగ్ వాయిస్‌కు ఫాన్స్ ఫిదా
సాక్షి, హైదరాబాద్ : ‘యాక్షన్’ సినిమా తెలుగు వెర్షన్ కోసం విలక్షణ నటుడు రానా గొంతు కలిపిన ర్యాప్ సాంగ్ దుమ్ము రేపుతోంది. యాక్షన్ సినిమా కోసం రానా ఈ పాట పాడినట్టు ఇటీవల విశాల ప్రకటించిన సంగతి తెలిసిందే. శాల్, తమన్న హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలోని ఈ మోస్ట్ ఎవైటెట్ రానా ర్యాప్ సాంగ్ మేకింగ్ వీడియోను గురువారం చిత్ర యూనిట్ రీలీజ్ చేసింది. విలక్షణ పాత్రల ఎంపికతో ఇప్పటికే తన అభిమానులను ఆకట్టుకున్న రానా తాజాగా తన మొట్టమొదటి సాంగ్‌తోనే ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. అంతేకాదు ‘అడుగడుగున పిడుగుల జడి’ అంటూ థ్రిల్లింగ్ వాయిస్‌తో సరికొత్త అవతార్‌లో విమర్శకుల చూపును కూడా తన వైపు తిప్పుకున్నాడు. కాగా సుందర్ సి దర్శకత్వంలో వస్తున్నఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. -
ర్యాప్‌దే హవా
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కెరీర్లో ‘గల్లీభాయ్’ వన్నాఫ్ ది బెస్ట్ మూవీస్‌గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ర్యాప్, హిప్ హాప్ మ్యూజిక్ ఫ్లేయర్‌గా రణ్వీర్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇటీవల ఈ రకం సంగీతానికి మంచి ఆదరణ దక్కుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో తన సంస్థ ఇంక్ ఇంక్ ద్వారా ర్యాప్, హిప్హాప్ సంగీతాన్ని ప్రోత్సహించాలని రణ్వీర్ నిర్ణయించుకున్నారు. ‘‘హిందుస్తానీ ర్యాప్, హిప్ హాప్ సంగీతానికి మంచి రోజులొచ్చాయి. ఈ సంగీత ప్రపంచానికి ర్యాప్ అవసరం కూడా. తమ స్వతంత్ర భావాలను వ్యక్తపరచడానికి ర్యాప్ సంగీతాన్ని ఓ గొప్ప పరికరంలా యువత వాడుకుంటోంది. ఎక్కడికి వెళ్లినా ర్యాప్ హవా కనిపిస్తోంది’’ అన్నారు రణ్వీర్. -
వైరల్ అవుతున్న సేవ్ అరుణాచల్’ పాట
-
‘సేవ్ అరుణాచల్’ పాట హల్చల్!
సాక్షి, న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో స్థిరపడిన ఇతర ప్రాంతాలకు చెందిన ఆరు ఆదివాసీ జాతుల వారికి శాశ్వత నివాస పత్రాలు జారీ చేయాలంటూ ఉన్నతాధికార కమిటీ చేసిన సిఫార్సుకు వ్యతిరేకంగా ఆరుణాచల్ ప్రదేశ్ ఆదివాసీలు గత శుక్రవారం నుంచి చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడం, ఆందోళనను అరికట్టేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించడం తెల్సిందే. దీనిపై స్పందించిన 24 ఏళ్ల యువ సంగీత దర్శకుడు, ర్యాప్ సింగర్ కెఖో తియామ్ఖో శనివారం నాడు ర్యాప్ శైలిలో ఓ పాట రాసి దానికి బాణి కూర్చి పాడారు. ఆ పాట ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ నేతలు తమను అన్యాయం చేస్తున్నారని, ఆ అన్యాయానికి వ్యతిరేకంగా ఎండయినా, వానయినా లెక్క చేయకుండా కలిసి కట్టుగా పోరాడతామంటూ ఆయన పాట సాగుతుంది. యూనిఫామ్ ధరించిన భద్రతా బలగాలు తలకెక్కిన ఉన్మాదంతో సొంత ప్రజలనే చంపుతున్నారన్న ఆ వేదన కూడా హృద్యంగా వినిపిస్తుంది. ‘సేవ్ అరుణాచల్’ పేరిట ఈ పాట విడుదలయింది. మూడు రోజుల ప్రజల ఆందోళనకు భయపడి పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఫార్సును ప్రస్తుతం అమలు చేయకుండా నిలిపి వేయాలని నిర్ణయించింది. -
ర్యాపర్ లుక్.. కుర్రాళ్లకు కిక్
ఆడవాళ్ల కోసం ప్రత్యేకించిన యాక్ససరీస్ స్టోర్లు సందుకొకటి అన్నట్టున్నాయి సిటీలో. మగవాళ్ల యాక్ససరీస్లకు సంబంధించిన స్టోర్లు కూడా అదేస్థాయిలో విస్తరిస్తున్నాయి. ఈ ట్రెండ్‌కి ఆజ్యం పోస్తోంది.. ఇటీవల సిటీ కుర్రాళ్లు ఆసక్తి చూపిస్తున్న ర్యాపర్ లుక్. - శిరీష చల్లపల్లి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ర్యాప్ మ్యూజిక్ క్రేజ్ లాగే లుక్ విషయంలోనూ ర్యాప్స్టార్లది ప్రత్యేక స్టైల్. ‘బ్రేక్ ది రూల్స్’ అన్నట్టు సాగే ర్యాప్ మ్యూజిక్ షోల కోసం.. ఆర్టిస్టులు సైతం రూల్స్ బ్రేకర్స్లాగే తమని తాము డిజైన్ చేసుకుంటారు. వీరిని అనుసరించే యూత్ సిటీలోనూ ఉండడంతో ఈ ర్యాపర్ లుక్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ర్యాపర్.. సూపర్ డ్రెస్సింగ్ ఎలా ఉన్నా ర్యాపర్ లుక్‌లో ప్రధాన పాత్ర పోషించేవి.. ఒంటి మీద ధరించే ఎక్స్ట్రా యాక్ససరీస్. అందుకే ఆ తరహా యాక్ససరీస్‌కు సిటీలో పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘ఖలేజా’ సినిమాలో మహేష్‌బాబు మెడలో వేసుకున్న మఫ్లర్, ‘రెబల్’ సినిమాలో ప్రభాస్ మెటల్చైన్, ట్రాన్స్పరెంట్ గాగుల్స్ వంటివన్నీ ఈ కోవలోనివే. ఇక స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈ లుక్‌కి ఫుల్ కిక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోగా చెప్పుకోవాలి. ర్యాప్‌స్టార్ తరహా గెటప్‌లో ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాలో ఈ క్రేజ్‌ను తారాస్థాయికి తీసుకెళ్లాడు బన్నీ. ‘రేసుగుర్రం’లో హైలైట్ లుక్‌తో అదరగొట్టాడు. దీంతో ఇప్పుడు యూత్ నెక్ చైన్లు, చిరిగిన షూస్‌తో సందడి చేస్తున్నారు. సినీ స్టార్స్ కోసం ఈ యాక్ససరీస్‌ను ముంబై, బెంగళూర్, బ్యాంకాక్, మలేషియా.. తదితర నగరాల్లో స్పెషల్‌గా షాపింగ్ చేసి మరీ కొనేవారు. కానీ ఇప్పుడు సిటీ యూత్‌కి పెరుగుతున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని మన నగరంలో సైతం స్టైలిష్ బాడీవేర్ల తయారీ ఊపందుకుంటోంది. తీర్చిదిద్దే వెరైటీలెన్నో.. మల్టీపర్పస్‌గా ఉపయోగించే మఫ్వేర్ని క్యాప్‌గా తొడుక్కొని కళ్లకు తగినట్లుగా అద్దాలు ధరించి.. పెదవికి పియర్సింగ్ చేయించి.. మెడలో మఫ్లర్.. ఆ లోపల కనీకనిపించని ఉడెన్ అండ్ బ్లాక్‌మెటల్ డాగ్ట్యాగ్స్.. ఆ చైన్లకు తమ మనోభావాలు వ్యక్తపరిచేట్లుగా ఉండే రకరకాల ప్లేబాయ్ లాకెట్లు.. ఇలాంటి వాటితో ర్యాపర్ లుక్ ఒక రకమైన కిక్ ఇస్తోందంటున్నారు సిటీ కుర్రాళ్లు. వీటితో పాటు సీ-షెల్స్, క్రాస్ సింబల్, మ్యాగ్నటిక్ బ్రోకెన్హార్ట్ లాకెట్.. యానిమల్ పార్ట్స్ కుర్రాళ్లకు యమక్రేజీగా మారాయి. చేతులకు స్కల్రింగ్స్, నకెల్ రింగ్స్, త్రీ ఫింగర్ జాయింట్ రింగ్, పచ్చబొట్టులా హ్యాండ్ టాటూ బ్యాండ్ మణికట్టు నుంచి భుజం దాకా వేసుకోవడం ఇందులో భాగమే. ఇంకా మణికట్టుకు లెదర్ బ్యాండ్స్, మెటల్ చైన్ బ్యాండ్స్, హాలోవీన్ బ్యాండ్, డిజిటల్ బ్యాండ్ ఇలా ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చాయి. డ్రెస్‌లకు యాడ్ చేసుకోవడానికి కూడా రకరకాల ర్యాపర్ యాక్ససరీస్ దొరుకుతున్నాయి. షర్ట్‌కు బో టైలు, పాకెట్ చైన్, స్మార్ట్ పిన్స్, షైనింగ్ లెడ్ యాక్ససరీస్ ఇలా ఎన్నో. మెడలో వేసుకొనే స్కార్ఫ్‌ని సైతం రోల్ చేసి ప్యాంట్ లూప్స్లోంచి తీసి బెల్ట్‌గా చూపించడం కూడా ఇందులో భాగమే. ప్రశ్నించే ఫ్యాషన్.. ఫ్యాషన్ అంటే ఇలా ఉండాలని నిర్వచించే దశ దాటి.. ఇలా ఎందుకు ఉండకూడదు? అంటూ తమ శైలి ద్వారా ప్రశ్నించేదే ర్యాపర్ లుక్ అని వర్ణించొచ్చు. ట్రెండ్‌ని ఫాలో అయ్యే వారే కాదు.. ట్రెండ్‌ను సృష్టించే వారిగా ఈ ర్యాపర్స్‌ని పేర్కొంటారు. ఈ తరహా క్రేజీ స్టఫ్ కోసం యాక్ససరీస్ ప్రత్యేకంగా తయారు చేయించుకోవడం, విభిన్న నగరాల నుంచి తెప్పించడం జరుగుతోందని ‘ఎఫ్ స్టోర్’ ఓనర్ అజయ్ రామ్ చెప్పారు. ఈ యాక్ససరీస్ కనీసం రూ.10 నుంచి రూ.500 వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫుల్ జోష్.. సినీ హీరోలకు, స్టేజ్ పెర్ఫార్మర్లకు మాత్రమే ఒకప్పుడు పరిమితమైన ర్యాపర్ లుక్ సిటీ యూత్‌కి బాగా ఫేవరెట్‌గా మారింది. డ్రెస్ డిజైనింగ్‌లోనూ ఈ లుక్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. డిఫరెంట్ యాక్ససరీస్ వినియోగం గురించి మమ్మల్ని తరచూ సలహాలు అడుగుతున్నారు. చాలామంది ఫ్యాషన్ ప్రియులు ఫ్యాబ్రిక్‌తో కూడా రకరకాల యాక్ససరీస్ కస్టమైజ్డ్గా డిజైన్ చేయించుకుంటున్నారు. - హర్ష, ఫ్యాషన్ డిజైనర్