
సాక్షి, హైదరాబాద్ : ‘యాక్షన్’ సినిమా తెలుగు వెర్షన్ కోసం విలక్షణ నటుడు రానా గొంతు కలిపిన ర్యాప్ సాంగ్ దుమ్ము రేపుతోంది. యాక్షన్ సినిమా కోసం రానా ఈ పాట పాడినట్టు ఇటీవల విశాల ప్రకటించిన సంగతి తెలిసిందే. శాల్, తమన్న హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలోని ఈ మోస్ట్ ఎవైటెట్ రానా ర్యాప్ సాంగ్ మేకింగ్ వీడియోను గురువారం చిత్ర యూనిట్ రీలీజ్ చేసింది. విలక్షణ పాత్రల ఎంపికతో ఇప్పటికే తన అభిమానులను ఆకట్టుకున్న రానా తాజాగా తన మొట్టమొదటి సాంగ్‌తోనే ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. అంతేకాదు ‘అడుగడుగున పిడుగుల జడి’ అంటూ థ్రిల్లింగ్ వాయిస్‌తో సరికొత్త అవతార్‌లో విమర్శకుల చూపును కూడా తన వైపు తిప్పుకున్నాడు. కాగా సుందర్ సి దర్శకత్వంలో వస్తున్నఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment