
జీతగాడు స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా
చంద్రబాబు వద్ద జీతగాడుగా ఉన్న వ్యక్తి.. ఆయనపైనే స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా అని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు, కూతురు, మేనల్లుడు కోట్ల రూపాయలు సంపాదించారంటూ విమర్శలు గుప్పించారు. పిరికిపంద, అవినీతిపరుడు, పాస్పోర్టులు అమ్ముకుని జైలుకు పోయిన కేసీఆర్.. ఇప్పుడు నీతుల గురించి మాట్లాడతాడా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.