నేను చంద్రబాబులా దొంగను కాను: కేసీఆర్ | I am not a thief like chandra babu, says t-cm kcr | Sakshi
Sakshi News home page

నేను చంద్రబాబులా దొంగను కాను: కేసీఆర్

Published Mon, Jun 8 2015 8:52 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

నేను చంద్రబాబులా దొంగను కాను: కేసీఆర్ - Sakshi

నేను చంద్రబాబులా దొంగను కాను: కేసీఆర్

చంద్రబాబును ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లో చంద్రబాబుకు ఏసీబీ ఉండొచ్చు గానీ, తాను మాత్రం ఆయనలా దొంగను కానని స్పష్టం చేశారు. హైదరాబాద్ నీ అబ్బ జాగీరా అంటూ మండిపడ్డారు. మంగళగిరిలో నిర్వహించిన మహా సంకల్ప సభలో చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు సీఎం కేసీఆర్ దీటుగా, అంతకు మించిన స్థాయిలో సమాధానమిచ్చారు. పట్టపగలు నగ్నంగా దొరికిపోయిన దొంగవు..ఇంకా నువ్వు మాట్లాడేదేంటని నిలదీశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

''పక్కరాష్ట్రం విడివి నువ్వు.. అలాంటిది మా ఎమ్మెల్యేలను కొంటే చూస్తూ ఊరుకోవాలా? చేతులకు గాజులు తొడిగించుకుని కూర్చోవాలా? అసలు ఎమ్మెల్సీని గెలిపించుకునే బలం లేదని తెలిసి కూడా పోటీ ఎందుకు పెట్టావు? నువ్వు లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తే, మా తెలంగాణ బిడ్డ స్టీఫెన్సన్ విషయం ఏసీబీకి చెప్పి మిమ్మల్ని పట్టించాడు. అయినా రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్లు.. సొంత రాష్ట్రం వచ్చినా ఈయన బాధ మాకు తప్పడం లేదు. హైదరాబాద్కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి.. తెలంగాణ బిడ్డ. నగ్నంగా పట్టపగలు దొరికిపోయావ్.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బాగోతం బయటపడింది. సత్య హరిశ్చంద్రుడి ఇంటి వెనుక నీ ఇల్లు ఉందిగా.. నువ్వెందుకు చేసినవీ పని?
అరువులతో ఏం చేయలేవు.. ఈ గడ్డపై నీ కిరికిరి చెల్లదు. తెలంగాణలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోడానికి మాకు రోజుకు 24 గంటలు సరిపోవడంలేదు. రోజుకు 18-20 గంటలు పనిచేయాల్సి వస్తోంది. అలాంటిది ఈయన గురించి పట్టిచుకోవాల్సిన ఖర్మ మాకేంది? ఇక్కడ కూడా అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నాడు. ఏసీబీకి పట్టుబడితే, ఇరికిస్తున్నారని చంద్రబాబు అంటున్నారు.
ఇరికిస్తే ఇరికిపోతాడా.. చంద్రబాబు?''

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement