నేనేమైనా ఈ కేసీఆర్కు సర్వెంటునా: చంద్రబాబు | am i a servant to kcr, questions chandra babu naidu | Sakshi
Sakshi News home page

నేనేమైనా ఈ కేసీఆర్కు సర్వెంటునా: చంద్రబాబు

Published Mon, Jun 8 2015 7:34 PM | Last Updated on Mon, Oct 8 2018 4:55 PM

నేనేమైనా ఈ కేసీఆర్కు సర్వెంటునా: చంద్రబాబు - Sakshi

నేనేమైనా ఈ కేసీఆర్కు సర్వెంటునా: చంద్రబాబు

ఉమ్మడి రాజధానిలో తన ఫోన్లు ట్యాప్ చేసే అధికారం కేసీఆర్కు ఎక్కడిదని, తానేమైనా కేసీఆర్కు సర్వెంటునా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన 'మహాసంకల్ప సభ'లో ఆయన మాట్లాడారు. తాను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు పెట్టారని, దాన్ని టీ ఛానల్లో ప్రసారం చేశారని అన్నారు. ''మన ఫోన్లు ట్యాప్ చేస్తే ఎంత కడుపు మండిపోతుంది.. చెప్పండి'' అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 

  • రాష్ట్రాల మధ్య తగాదా వద్దు. టీఆర్ఎస్ ప్రభుత్వం దయచేసి ఆలోచించాలి.
  • రేవంత్ రెడ్డి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు.
  • నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించారు. ఇది నీ జాగీరా.. కాదు.
  • నామీద కుట్ర చేస్తున్నారు. నీతి, నిజాయితీగా బతికాను. ప్రజా సేవ కోసం బతికాను.
  • కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నామీద కుట్ర పన్నుతున్నాడు. అవునా కాదా తమ్ముళ్లూ అని అడుగుతున్నా.
  • హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కుందో, నాకూ అంతే హక్కుంది.
  • ఖబడ్దార్, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
  • ఐదో అభ్యర్థిని కూడా టీఆర్ఎస్ నిలబెట్టిందంటే అది నీతిమాలిన చర్య కాదా అని అడుగుతున్నాను.
  • ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం నీచాతి నీచం.
  • ఫోన్లు ట్యాప్ చేస్తే ప్రభుత్వాలే పడిపోయాయి.
  • ఈరోజు నేను ఒక వ్యక్తిని కాను.. ఏపీ ముఖ్యమంత్రిని. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్ కి ఎవరిచ్చారని అడుగుతున్నాను.
  • నేనేమైనా ఈ కేసీఆర్కి సర్వెంట్నా అని అడుగుతున్నా.
  • మీరు మామీద ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో నన్ను బెదిరించాలంటే మీ తరం కాదు.
  • మీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉంది.
  • మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నా ఏసీబీ కూడా హైదరాబాద్ లోనే ఉంది.
  • మీకు పోలీసులున్నారు, మాకు కూడా పో్లీసులు హైదరాబాద్లోనే ఉన్నారు.
  • మా ఎమ్మెల్యేని ఎన్నికలకు ముందు మీ ఫాం హౌస్ కు తీసుకెళ్లి, సిగ్గులేకుండా పోలీసు ప్రొటెక్షన్తో పంపినప్పుడు మీకు సిగ్గులేదా
  • శ్రీనివాసయాదవ్ అనే ఎమ్మెల్యేకి మంత్రిపదవి ఇచ్చినప్పుడు యాంటీ డీఫెక్షన్ మీకు గుర్తులేదా?
  • 22 మంది ఎమ్మెల్యేలు నాకున్నారు. ఎమ్మెల్సీ నాకో లెక్క కాదు.
  • నాకు ఎమ్మెల్సీ ముఖ్యం కాదు.. నీతి ముఖ్యం, సిద్దాంతం ముఖ్యం.
  • హైదరాబాద్లో ఆంధ్రావాళ్లను తిడుతూ ప్రతిరోజూ ఇష్టం వచ్చినట్లు ఆంధ్రావాళ్ల ఇళ్లు కూల్చేయడానికి వెళ్తున్నారు.
  • మా ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు సెక్షన్ 8 ఉంటే, గవర్నర్కు అధికారం ఉంటే మామీద పెత్తనం చేయడానికి మీరెవరని అడుగుతున్నా
  • పదేళ్లు ఉమ్మడి రాజధానిలో మనం గౌరవంగా బతికే అధికారం ఉందా లేదా అని అడుగుతున్నా
  • ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని, గౌరవం లేని మాటలంటారా, అగౌరవ పరుస్తారా? నన్ను కాదు మీరు అగౌరవ పరిచేది.. ఐదుకోట్ల ప్రజలను. మా ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మీకు బుద్ధి లేదా?
  • సమయం వచ్చినప్పుడు ఒక్కో అస్త్రం వదులుతా.
  • టీఆర్ఎస్ పార్టీ పెత్తనంపై నేను ఆధారపడలేదు, వీళ్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement