కఠిన చర్యలకు కాంగ్రెస్, లెఫ్ట్, బీజేపీ డిమాండ్
న్యూఢిల్లీ: ఓ ప్రైవేటు కంపెనీకి లాభం చేకూర్చేందుకు ఓ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీతో సహా పలువురు ముడుపులు తీసుకుంటున్నట్లు తేల్చిన స్టింగ్ ఆపరేషన్‌పై లోక్‌సభలో తృణమూల్, ఆ పార్టీ సభ్యులపై బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఎంపీలు మండిపడ్డారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై విచారణ జరిపి తృణమూల్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లెఫ్ట్, తృణమూల్ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. రాజకీయంగా ఎదుర్కొనలేకే తమపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని తృణమూల్ ఆరోపించగా.. ఇలాంటి వ్యక్తులతో కలిసి పార్లమెంటులో కూర్చోవటం సిగ్గుగా ఉందని.. సీపీఎం విమర్శించింది.
ఈ ఆపరేషన్‌ను విచారించేందుకు పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలని సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతుంది లేదంటే.. స్పీకర్ కమిటీ వేయవచ్చు’ అని తెలిపారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలో ఇది తృణమూల్‌కు గట్టిదెబ్బే. కొన్నేళ్ల క్రితం ఇలా ముడుపులు తీసుకుంటూ దొరికిపోయిన 11 మంది సభ్యులను పార్లమెంటు సస్పెండ్ చేసిన విషయాన్ని వివిధ పార్టీల ఎంపీలు గుర్తుచేశారు. కాగా, స్టింగ్ వీడియోను ఎన్నిలక సంఘం పరీక్షిస్తుందని సీఈసీ నసీం జైదీ వెల్లడించారు.
తృణమూల్ చుట్టూ ‘స్టింగ్’ ఉచ్చు
Published Wed, Mar 16 2016 1:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement