ఆ పార్టీలకు తగిన విధానాలు లేవు
‘మీట్ ది ప్రెస్’లో తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన విధానాలు లేవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ సీఎం కేసీఆర్ పచ్చి నియంతృత్వాన్ని సాగిస్తున్నారని, కమ్యూనిస్టును అని చెప్పుకునే అర్హత కేసీఆర్‌కు లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, అనుబంధ హెచ్‌యూజే ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, టీఆర్‌ఎస్ పాలనలో రూ.70 వేల కోట్ల మేర అప్పులయ్యాయని అన్నారు. సామాజికన్యాయంపై ఐక్యకార్యాచరణకు ప్రజాగాయకుడు గద్దర్, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, జస్టిస్‌చంద్రకుమార్, ఆర్.కృష్ణయ్య, వివిధ సామాజిక సంస్థలతో చర్చిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరడం లేదనేది తమ పాదయాత్రలో స్పష్టమైందన్నారు.