చిన్నచేప దొరికింది.. పెద్దది తప్పించుకుంది | bigger fish escaped, says bjp leader on bihar minister graft issue | Sakshi
Sakshi News home page

చిన్నచేప దొరికింది.. పెద్దది తప్పించుకుంది

Published Mon, Oct 12 2015 8:01 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

చిన్నచేప దొరికింది.. పెద్దది తప్పించుకుంది - Sakshi

చిన్నచేప దొరికింది.. పెద్దది తప్పించుకుంది

బిహార్‌లో తొలిదశ పోలింగ్ ముందురోజు నితీశ్‌కుమార్ సర్కారు ఇబ్బందికర పరిస్థితిలో పడింది.

బిహార్‌లో తొలిదశ పోలింగ్ ముందురోజు నితీశ్‌కుమార్ సర్కారు ఇబ్బందికర పరిస్థితిలో పడింది. నితీశ్ కేబినెట్‌లో పట్టణాభివృద్ధి, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ప్రొహిబిషన్ మంత్రిగా ఉన్న అవధేశ్‌ ప్రసాద్‌ కుష్వాహా రూ. 4 లక్షల లంచం తీసుకుంటున్నట్లుగా చూపిస్తున్న స్టింగ్ ఆపరేషన్ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు.

అయితే, నిజానికి ఈ విషయంలో చిన్నచేప మాత్రమే దొరికిందని, పెద్ద చేప దొరకాల్సింది గానీ, తప్పించుకుందని బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. అంటే, బిహార్ మంత్రివర్గంలో మరో పెద్ద నాయకుడిపై కూడా ఈ స్టింగ్ ఆపరేషన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు మంత్రి కుష్వాహా రాజీనామాను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపినట్లు అధికార జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్ మీడియాకు తెలిపారు. తూర్పు చంపారన్ జిల్లాలోని పిప్రా నియోజకవర్గం అభ్యర్థిగా కూడా అవధేష్‌ను తప్పిస్తున్నామని, ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెడతామని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement