
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పన్నీర్ సెల్వం కోవిడ్-19తో ఆస్పత్రిలో చేరారు. కరోనాకి సంబంధించిన లక్షణాలతో ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం ఉదయమే ఆయన అడ్మిట్ అయ్యారు. ఈ మేరకు పన్నీర్ సెల్వం ఐసోలేషన్ యూనిట్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు ఎంజీఎం హెల్త్‌కేర్ ఓ మెడికల్ బులిటిన్ విడుదల చేసింది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని హెల్త్ బులెటన్‌లో పేర్కొన్నారు.. పన్నీర్ సెల్వం త్వరితగతిన కోలుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన ఆకాంక్షించారు. ఇటీవలే పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా, సీఎం స్టాలిన్ సైతం కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
(చదవండి: ఇది ఆమోదయోగ్యం కాదు! బలవంతపు ఏకపక్షవాదం: కపిల్ సిబల్)