
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆరోగ్యం క్షీణించడంతో మాజీ ముఖ్యమంత్రి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై ఆందోళన.
రాయగడ: ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ గిరిధర్ గొమాంగొ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం భువనేశ్వర్ ఎయిమ్స్ హాస్పిటల్‌లో చేర్పించినట్లు ఆయన కుమారుడు, బీజేపీ నాయకుడు శిశిర్ గొమాంగొ ఓ ప్రకటనలో సోమవారం వెల్లడించారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఆరోగ్యం కోలుకుని ఇంటికి చేరుకోగా, ఇంటికి చేరిన కొన్నిరోజులకే ఇలా బాగాలేకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు శిశిర్ గొమాంగొ తెలిపారు.
చదవండి: రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు అంతలోనే..
చదవండి: కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి