![Odisha: Renowned Football Coach Nanda Kishore Dies Of Covid - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/2/Nanda-Kishore-Patnaik.gif.webp?itok=nJxrrFzx)
ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ నందకిశోర్ పట్నాయక్
భువనేశ్వర్: రాష్ట్రంలో పేరొందిన ఫుట్‌బాల్ కోచ్ నంద కిషోర్ పట్నాయక్ కరోనా చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. ఫుట్‌బాల్ క్రీడారంగంలో రాష్ట్రం నుంచి పలువురు అంతర్జాతీయ క్రీడాకారుల్ని ఆవిష్కరించిన విశిష్ట వ్యక్తి అని సంతాప సందేశంలో పేర్కొన్నారు.
1956 మార్చి 16వ తేదీన జన్మించిన నంద కిషోర్ పట్నాయక్ రెండుసార్లు జాతీయ జూనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు ఒడిశా జట్టుకు సారథ్యం వహించారు. 1992-93లో ఫుట్‌బాల్ కోచ్‌గా నియమితులయ్యారు. తర్వాత 1995లో మహిళా ఫుట్‌బాల్ కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన కోచింగ్‌లో శ్రద్ధాంజలి సామంత్రాయ్, రంజిత మహంతి, ప్రశాంతి ప్రధాన్, సుదీప్త దాస్, సరిత జయంతి బెహరా, మమాలి దాస్, ప్రథమా ప్రియదర్శి వంటి అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణులు రాష్ట్ర కీర్తి కిరీటాలుగా వన్నె తెచ్చారు.
చదవండి: కరోనాతో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మృతి
తన విద్యార్థులతో కోచ్ నందకిశోర్ పట్నాయక్ (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment