
కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా వైరస్ సోకింది. రాజకీయ దురంధరుడిగా పేరు పొందిన భట్టాచార్యకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. 77 ఏళ్ల బుద్ధదేవ్ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయన సతీమణి మీరా భట్టాచార్యకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే మీరా భట్టాచార్య మాత్రం ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. వారి సహాయకుడికి కరోనా సోకిందని సమాచారం. బుద్ధదేవ్ భట్టాచార్య పదకొండేళ్ల పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.
చదవండి: ఉత్తరప్రదేశ్ మంత్రి కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment