రేపు అసెంబ్లీలో డీఎంకే వ్యూహం ఏంటి? | DMK working president MK Stalin chairs party strategy committee meeting | Sakshi
Sakshi News home page

రేపు అసెంబ్లీలో డీఎంకే వ్యూహం ఏంటి?

Published Fri, Feb 17 2017 12:10 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM

రేపు అసెంబ్లీలో డీఎంకే వ్యూహం ఏంటి?

రేపు అసెంబ్లీలో డీఎంకే వ్యూహం ఏంటి?

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో శనివారం జరిగే బలపరీక్షలో తటస్థంగా ఉండాలని ప్రతిపక్ష డీఎంకే యోచిస్తోంది. కాసేపట్లో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత స్టాలిన్ అధ్యక్షతన ఆ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం కాబోతోంది. రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

బలపరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామి మెజార్టీ నిరూపించుకుంటారా? మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు ఎలా వ్యవహరిస్తారన్న విషయాలపైనా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. కాగా అన్నా డీఎంకే రాజకీయాల్లో తలదూర్చరాదని, బలపరీక్షలో తటస్థంగా ఉండాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం స్టాలిన్ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశమై చర్చించనున్నారు. నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పళనిస్వామి రేపు ప్రత్యేకంగా సమావేశమయ్యే తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement