స్పీకర్‌తో సెల్వం వర్గీయుల భేటీ
చెన్నై: తమిళనాడు రాజకీయాలు మళ్లీ ఉత్కంఠగా మారాయి. రేపు (శనివారం) అసెంబ్లీలో బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు అసెంబ్లీ స్పీకర్ ధన్‌పాల్‌తో సమావేశమయ్యారు. రహస్య ఓటింగ్ ద్వారా బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పన్నీరు వర్గంలో ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, శశికళ వర్గంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పళనిస్వామి బెంగళూరు పర్యటనను రద్దు చేసుకుని.. ఎమ్మెల్యేలను క్యాంపుగా ఉంచిన గోల్డెన్ బే రిస్టార్‌కు వెళ్లి వారితో సమావేశమయ్యారు. ఇక ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పార్టీ నేతలతో సమావేశమై రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
మరిన్ని తమిళనాడు వార్తలు చదవండి
జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ
చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే
బలాబలాలు తేలేది రేపే
తమిళనాడుకు పళని 'స్వామి'
కుటుంబపాలనను నిర్మూలిస్తాం