
సాక్షి, తిరుమల: ఈ నెల 24న తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమలకు రానున్నారు. తిరుచానూరు, తిరుమల ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు. రాష్ట్రపతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలకనున్నారు. (చదవండి: అశ్లీల వీడియో వివాదం: ఎస్వీబీసీ ఉద్యోగి తొలగింపు)
తిరుమలకు చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి..
శ్రీవారి దర్శనార్థం తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి తిరుమలకు చేరుకున్నారు. రోడ్డు మార్గంలో ఆయన సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకి చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రేపు(మంగళవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. (చదవండి: తిరుమలలో కుండపోత వర్షం)
Comments
Please login to add a commentAdd a comment