చెన్నై : దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. దీంతో లాక్‌డౌన్ 6.0 విధిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్టవ్యాప్తంగా జూలై 31 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్ ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో
పూజా కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఇక గ్రేటర్ చెన్నై పరిధిలోని చెన్నై, కాంచిపురం, చెంగల్పట్టు, తిరువళ్లువార్ ప్రాంతాల్లో ఇది వరకే అమల్లో ఉన్న లాక్‌డౌన్ జూలై 5న ముగియనుంది. ఈ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు లేవని సీఎం స్పష్టం చేశారు. (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కోవిడ్ నిర్ధారణ )
ఇప్పటికే మహారాష్ట్రతో పాటు జార్ఖండ్, అసోం తదితర రాష్ట్రాలు జులై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తుందిని మరో రెండు,మూడు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గత 24 గంటల్లోనే రాష్ర్ట వ్యాప్తంగా 3,949 కొత్త కేసులు నమోదుకాగా 62 మంది చనిపోయారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 86,224కు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. (ముందుగా వైద్య సిబ్బందికి టీకా! )
Comments
Please login to add a commentAdd a comment