
తమిళనాడు సర్కార్‌పై కమల్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు రాజకీయ పరిణామాలపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్తుల కూటమికి నేటి తమిళ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
చెన్నై: తమిళనాడు రాజకీయ పరిణామాలపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్తుల కూటమికి నేటి తమిళ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీని శుభ్రం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నాడీఎంకే తాత్కాళిక చీఫ్ వీకే శశికళ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ క్రిమినల్ కూటమంతా ఒక చోట చేరిందని మండిపడ్డారు. శశికళ వర్గం నుంచి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఎన్నికవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఊహించినట్లుగా జరగలేదని అన్నారు.
‘నిజమేమిటో కోర్టు పదేపదే తేల్చి చెప్పింది. శశికళే కాదు.. చనిపోయిన జయలలిత కూడా అక్రమాస్తుల కేసులో దోషి అని స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీని ఫ్లోర్‌ను శుభ్రం చేయాల్సి ఉంది. ప్రజల వద్దకు ఎన్నికలు తీసుకెళ్లండి. వారి మనసులో ఏముందో చెప్తారు. నేను చాలా కోపస్తుడిని. నేను రాజకీయాలకు సరిపోను. కోపంతో ఉండే వ్యక్తులు రాజకీయాలకు అవసరం లేదు. రాజకీయ నాయకులంటే గొప్ప సమతౌల్యం పాటించేవారిగా ఉండాలి. ఇప్పుడు నేను చాలా కోపంతో ఉన్నాను. నాలాగా చాలామంది ప్రజలు కోపంతో ఉన్నారు’ అని కమల్ చెప్పారు. ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సంబంధిత వార్తలకై చదవండి..
జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి
చెన్నైకు చిన్నమ్మ?
విజేత పళని
అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్
నాడూ.. నేడూ.. అదే డ్రామా!
చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్
స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు