సాక్షి, చెన్నై: తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వని పక్షంలో మెరీనాతీరంలోని జయలలిత సమాధిని పెట్రోబాంబులతో పేల్చేస్తానని ఏకంగా ఓ యువకుడి డీజీపీ కార్యాలయానికి వచ్చి మరీ హెచ్చరికలు ఇచ్చాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని మానసిక వైద్య నిపుణుల వద్దకు పంపించారు. కొరుక్కుపేట భారతీరాజా హౌసింగ్ బోర్డుకు చెందిన మణిగండన్ బుధవారం మెరీనా తీరంలోని డీజీపీ కార్యాలయానికి వచ్చాడు. అక్కడి ఫిర్యాదుల విభాగం వద్దకు వెళ్లి ఓ విజ్ఞప్తిని అధికారులకు అందజేశాడు. దీనిని చదివిన అధికారులు హడలెత్తారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని లేనిపక్షంలో జయలలిత సమాధిని నాటుబాంబులతో పేల్చేస్తానని యువకుడు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అతడ్ని అదుపులోకి తీసుకుని సోదాలు చేశారు. అయితే, అతడి చర్యలు మానసిక రోగి తరహాలో ఉండడంతో మెరీనా పోలీసులకు అప్పగించారు. వారు సమగ్ర విచారణ తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో మానసిక ఒత్తిడికి గురైనట్టు తేలింది. దీంతో అతడ్ని మానసిక వైద్యుల వద్దకు పంపించారు.
సీఎం ఇంటికి బాంబు బూచి..
చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డు, సేలంలోని సీఎం నివాసాల్ని బాంబులతో పేల్చి వేస్తున్నట్టు వచ్చిన బెదిరింపు కాల్ మంగళవారం రాత్రి అధికారుల్ని పరుగులు తీయించింది. ఆయన ఇంటి పరిసరాల్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు. భద్రతను పెంచారు. వేలూరు ప్రచార పర్యటన సందర్భంగా సీఎం కాన్వాయ్ వైపు ఓ కారులో తుపాకీ, నాటు బాంబులు బయటపడిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగానే వ్యవహరించారు. సోదాల తర్వాత ఇది కేవలం బెదిరింపు కాల్‌గా తేలింది. కంట్రోల్‌రూమ్‌కు వచ్చిన సెల్ నంబర్ ఆధారంగా సైబర్ క్రైం వర్గాలు తిరుప్పూర్‌కు చెందిన ఓ యువకుడ్ని బుధవారం అరెస్టు చేసి విచారిస్తున్నారు.
(చదవండి: కిలాడీ దంపతులు: బండారం బట్టబయలు..)
అరుదైన దృశ్యం.. ఒకేసారి మూడు పులులు
Comments
Please login to add a commentAdd a comment