chinni
-
లోకేశ్ సేవలో తరిస్తున్న ఏసీఏ
సాక్షి, అమరావతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గురించి అందరికీ తెలుసు.. మరి మంగళగిరి ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్) గురించి మీకు తెలుసా? సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రత్యేక ఆసక్తితో నిర్వహిస్తున్న లీగ్ ఇది. తన స్వామి భక్తిని చాటుకునేందుకు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ఈ లీగ్‌కు రూపకల్పన చేశారు. ఈ నెల 23న లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా 22 మ్యాచ్‌లతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో ఆదివారం కేశినేని చిన్ని దీనిని ప్రారంభించారు. 22వ తేదీ వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని.. 23న ఫైనల్స్ నిర్వహించి విజేతకు అవార్డు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏసీఏ నిధులు దుర్వినియోగం!కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఏసీఏను లోకేశ్ కోటరీ తమ గుప్పెట్లోకి తీసుకుంది. కేశినేని చిన్నిని అధ్యక్షుడిగా, తన సన్నిహితుడు, లాబీయిస్టు అయిన సానా సతీశ్‌ను ప్రధాన కార్యదర్శి పీఠంపై కూర్చోబెట్టారు లోకేశ్. అప్పటి నుంచి కేశినేని చిన్ని, సానా సతీశ్ క్రికెట్ ప్రయోజనాలను పక్కనపెట్టి.. లోకేశ్ కోసమే ఏసీఏను ఉపయోగిస్తున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం కోసం ఏకంగా ప్రీమియర్ లీగ్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం గవర్నింగ్ బాడీ సమావేశంలో షెడ్యూల్‌ను రూపొందించి లీగ్‌లు నిర్వహిస్తుంటారు. కానీ కేశినేని చిన్ని అవేమీ చేయకుండా.. ఎవరినీ సంప్రదించకుండానే ఈ లీగ్‌ను ప్రకటించారు. ఏసీఏ నిధులు, వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ ఏసీఏ నిధులు ఉపయోగిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నియోజకవర్గమే ముఖ్యమా?వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు, క్రీడాకారులకు చేయూత అందించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో పోటీలు నిర్వహిస్తే కూటమి నేతలు అవాకులు, చెవాకులు పేలారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, దాదాపు అన్ని క్రీడలతో ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహిస్తే విమర్శలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు కేవలం సీఎం తనయుడి కోసం ఆయన నియోజకవర్గంలో మాత్రమే లీగ్ పెట్టడం, దానికి ఏసీఏను ఉపయోగించుకోవడం గమనార్హం. రాష్ట్రమంతటికీ ప్రాతినిధ్యం వహించి పనిచేయాల్సిన ఏసీఏ.. కేవలం ఒక నియోజకవర్గంలో ఒక నేత కోసమే పని చేయడమేమిటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
హారతి ఇచ్చుకో.. వెయ్యి పుచ్చుకో!
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనాచౌదరి, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎన్నికల తాయిలాలకు తెరతీశారు. ఇందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. హారతి పట్టు, వెయ్యి కొట్టు అన్న చందంగా తొలిరోజు వీరి ప్రచారం సాగింది. శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురంలోని 40, 41 డివిజన్ల నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనాచౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ పర్యటనలో మహిళలు హారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టారు. హారతి పళ్లానికి రూ.వెయ్యి, టెంకాయ కొట్టినందుకు రూ. వెయ్యి చొప్పున సుజనా చౌదరి, కేశినేని చిన్ని మహిళలకు తాయిలాలు అందజేశారు. ప్రచారంలో మహిళలు వరుసగా నిలబడడం అభ్యర్థులకు హారతులు పట్టడం తంతుగా మారింది. హారతులు పట్టిస్తూ కొబ్బరి కాయలు కొట్టిస్తూ అభ్యర్థులు యథేచ్ఛగా నగదు పంపిణీ చేశారు. కూటమి అభ్యర్థుల ప్రచారం కాస్ట్లీగా మార్చేశారు. తొలిరోజే ఇలా ఉంటే ఎన్నికల వరకు ఇంకెంత విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తారో.. ఇంకెన్ని వినూత్న మార్గాలు ఎంచుకుని డబ్బులు పంచుతారో అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఒక సామాన్యుడిపై బీజేపీ తరపున ఎన్నికల బరిలో దిగిన సుజానా చౌదరి ప్రచారం ప్రారంభం రోజే డబ్బులు వెదజల్లడం చూసి ఈ ఎన్నికలు పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధమేనని పలువురు చర్చించుకుంటున్నారు. హారతి పట్టించుకుంటూ పళ్లంలో రూ. వెయ్యి చొప్పున వేస్తూ సుజనా చౌదరి కోడ్ ఉల్లంఘించారు. అనర్హులుగా ప్రకటించాలి పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన తెలుగుదేశం విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని), విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిలను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్‌కుమార్ ఓ ప్రకటనలో ఎన్నికల సంఘాన్ని కోరారు. భవానిపురం ప్రాంతంలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు హారతుల పేరుతో డబ్బులు వేసి ఆశ చూపారన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. -
పెద్దారెడ్డి టాక్స్ : సీటీ సిరగతాదేమో జాగర్త సిన్నీ!
ఓర్నాయనో.. అబ్బయ్యా సిన్నీ! మీ అన్నకి సెంద్రబాబు సీటీ సించేసే సరికి నీకు మహా కుశాలగా ఉన్నట్టుండాదే అబ్బయ్యా! ఇన్నేళ్లు సెంద్రబాబుకి ఊడిగం జేసిన మీ అన్నయ్యని మెడ బట్టుకోని బయటకి గెంటేసిన తర్వాత.. రాజ్జెమంతా నీదే అయిపోతాదని మురిసిపోతా వున్నట్టుండావు గదా. అప్పుడే నీకు ఎంపీ టిక్కెట్టు ఇచ్చేసినట్టు.. నువ్వు సైకిలెక్కి లగెత్తుకోని డిల్లీలో పార్లమెంటుకు పోయినట్టు కళ్లముందు సెవెంటీ ఎమ్మెమ్ములో కనిపిస్తా వున్నట్టుండాది గదా! అంతేలే అబ్బయ్యా.. యీ మాదిర్తో అరసేతిలో సొర్గాన్ని జూపించకపోతే.. ఆ సెంద్రబాబు మాత్తరం పార్టీని ఎట్టా నడుపుకుంటాళ్లే? యీ కలలు కొంచిం కట్టిపెట్టి.. నా మాటలు కొంచిం జాగర్తగా ఆలకించుకో అబ్బయ్యా! మీ అన్నకైనా నెత్తిన పదేళ్లు కిరీటం నిలబడినాది. నీ కాడికి వొస్తే.. అసలు ఎలచ్చను గంట మోగడానికి ముందుగాలే.. నీ సీటీ సిరిగిపొతాదేమో అని అనుమానంగా వుండాదబ్బయ్యా.. ఎట్టాగంటవా? అదే జెప్పబోతన్నా.. రొవ్వంత జాగర్తగా యినుకో! సెంద్రబాబు మీ అన్న నాని మీద పగబట్టినట్టుగా గెంటేసినాక ఏదో జగనన్న పంచన జేరినాడనుకో. అదాటుగా నువు సీన్లోకి బలే ఎంట్రీ ఇచ్చినావబ్బయ్యా! మా అన్న రెండు సార్లు గెలిస్తే.. అసలు ఆ ఎలచ్చన్లలో పన్జేసి గెలిపించింది నేనే అంటావుంటివి. ఏమోనబ్బా.. మా నెల్లూరు మీ బెజవాడకి శానా దూరం గదా. అందుకేగావాల నీ పేరు యిదివరలో యినబడలా! సరే, ‘గెలుపు అనే బిడ్డకి శానా మంది నాయినలుంటారని’ ఇంగ్లీసులో ఓ సామెతుండాదిలే. ఆ మాదిరిగా మీ అన్నయ్య గెలిస్తే అంతా నీ పెతాపమే అని జెప్పుకుంటా వుండావు. ఓకే! అన్నయ్యని బయటకి పంపేయగానే.. సెంద్రబాబుకు వత్తాసు ఏసుకోని శానా దుడుకు మాటలు అంటావుండావు. మీ అన్న నానికి అంత సీన్లేదని అంటావుండావు. ఆయన లేడు గనక.. బెజవాడ సీటుని నీ సేతుల్లో యేలుకో తమ్ముడా అని సెంద్రబాబు అనబోతాడని నీకు ఆసె గదా. ఆయన గొప్పదనం గూడా యిట్టాంటి ఆసెలు పుట్టించడమే గదా? మరైతే సీక్రేటు జెప్తా యిను.. సుజనా సౌదరి అనే పెద్దమడిసి నీకు ఎరుకే గదా! మీ సెంద్రబాబు తోలితేనే గదా ఆయన పొయ్యి పువ్వు పార్టీలో గూసోని ఆణ్నించి రాజకీయం జేస్తన్నాడు. ఆయనకీ సెంద్రబాబుకీ ఉండే బందం పైకి కనపడకపొయినా సరే.. ఫెవికాల్తో అతికించినదానికంటె గట్టిదేననే సంగతి నీగ్గూడా తెలుసు గదా. మరి తాజా తాజా కబుర్లు నీ సెవిలో పడినాయో లేదో! ఆ సుజనా సౌదరి అనే పెద్దమడిసి బెజవాడ ఎంపీ సీటు మీద కన్నేసినాడంట. ఎటూ పువ్వు పార్టీలో ఉన్నాడు గాబట్టి.. పువ్వు టిక్కెట్టు మీదనే పోటీ జేస్తాడనుకో… నీకు యిప్పుటికిప్పుడు అడ్డం రాబోయేదేమీ లే. కాపోతే.. పువ్వుతో సైకిలుకి, గాజుగ్లాసుకి ముడిపడతాదేమో అని కూడా ఆయనే లీకులు వదలతండాడు అబ్బయ్యా సిన్నీ! యినుకున్నావా?? అదేగానీ జరిగిందనుకో.. ఎంపీల వరకు గెలిసే సీట్లే గావాలని పువ్వు పార్టీవోళ్లు ఫిటింగు బెట్టకుండా వుంటారా? ఆముడి పడినా బెజవాడ పువ్వుకే సమర్పయామి అయిపోతాది. అప్పుడిక నీ బతుకు మూడుజెండాలు బుజాన యేస్కోని మళ్లీ వూరంతా తిరగతా వుండడమే. నీకొక దారీ దిక్కూ యెప్పుటికి దక్కతాదో యెవురికెరుక అబ్బయ్యా! ఒకేళ- పువ్వుతో సైకిలుకు ముడిపడలేదే అనుకో.. నీ బతుకు యింకా కనాగస్టంగా అయిపోతా దబ్బయ్యా! సెంద్రబాబు ఒక సేత్తో నీకు టికెటిస్తాడనుకుందాం. రెండో సేత్తో- రెండో కంటికి తెలీకుండా నీ యెనకాల గొయ్యి కూడా తవ్విపెడతాడు! గోయిందా గోయింద! ‘సీసీ.. అట్టా యెందుకు జేస్తాడు’ అని గీర మాటలు మాటాడబోక నాయినా! అదే మరి సెంద్రబాబు మంత్రాగం. నీలాంటోడు ఆయన్ని నమ్ముకోని యెప్పుటికీ యీ పంచనే పడుంటాడు. కానీ.. పువ్వు పార్టీలోకి సెంద్రబాబు సొరబెట్టిన సుజనా సౌదరి లాంటి పెద్దమడిసి గెలిస్తే.. ఢిల్లీలో గూసోని బాబు గారి పన్లన్నీ గుట్టుసప్పుడు గాకుండా సక్కబెడతా వుంటాడు గదా! అదొక్కటే యేముండాదిలే. లోపల్లోపల ఆ సౌదరికీ- సెంద్రబాబుకీ యెన్నిన్ని లుకలుకల బందాలుండాయో నేను నీకు జెప్పాల్నా అబ్బయ్యా..! నెల్లూరోణ్ని- నాకంటే.. బెజవాడోడివి- నీకే యిట్టాంటి లోగుట్టు కతలు మాబాగా తెలస్తాయి. కాదంటావా? కాబట్టి నాయినా సిన్నీ! అన్నియ్య పొయినాడని.. యిక రాజ్జెమంతా నువ్వే యేలుకోవచ్చునని మురిసిపోబాక. మిడిసిపడబోక. ‘యెన్నాల్లో యేసిన వుదయం.. ఇయ్యాలే ఎదురవుతోంటే..’ అని సాంగులూ గట్రా యేసుకోని పండగజేసుకోబాక. సెంద్రనీతి రాజకీయాల్లో యింకా యెన్నెన్ని టర్నింగులుండాయో.. యెన్నెన్ని లోయలుండాయో.. నీ కలలబండి యేడ కూలిపోబోతాదో.. తెలవదు గదా! అందుకే రొవ్వంత జాగర్తగా పో అబ్బయ్యా! యింకా నాకు తిరుగు లేదని యిసురుకుంటా తిరిగినావనుకో.. అన్నకు జేసిన మాదిరిగానే సెంద్రబాబు నీ సీటీ గూడా అవలీలగా సించేయగల్డు! ✍️నెల్లూరు పెద్దారెడ్డి -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..
తిరువూరు: టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్‌మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్‌ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీసులో కుర్చీలు విసురుకుంటున్న కార్యకర్తలు ఎస్ఐపై కార్యకర్తల దాడి.. టీడీపీ వర్గవిబేధాల నేపథ్యంలో బుధవారం తిరువూరు పార్టీ కార్యాలయంలో ఘర్షణ పడిన కార్యకర్తలు పోలీసులపైనే దాడులకు పాల్పడ్డారు. రణరంగాన్ని తలపించే రీతిలో కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్నిల వర్గీయులు దాడికి తెగపడి కుర్చీలు విసురుకున్నారు. పరిస్థితి అదుపు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టినప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో నాని, చిన్నీల అనుచరులు బీభత్సం సృష్టించారు. చేతికందిన వస్తువుల్ని విసురుకుంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేసే యత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. గాయపడిన ఎస్ఐ సతీష్ తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సంఘటనతో భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దాడులకు పాల్పడవద్దని, శాంతియుతంగా వ్యవహరించాలని పదే పదే కోరినా ఫలితం లేకపోవడంతో లాఠీఛార్జీ చేసి అల్లరిమూకలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు కుర్చీలు విసిరారు. ఈ దాడిలో తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు బలమైన గాయమైంది. ఎట్టకేలకు ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎస్ఐ సతీష్‌ను ఆసుపత్రికి తరలించారు. కవ్వింపు చర్యలకు పాల్పడిన ఇరువర్గాలు.. పార్టీ కార్యాలయంలో పరిస్థితి చేయి దాటుతున్నప్పటికీ ఎంపీ నాని, చిన్ని ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మీడియాతో మాట్లాడేందుకు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు సైతం అదుపు చేయలేకపోయారు. తోపులాటలో ఒక మహిళా కార్యకర్తకు సైతం గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటన గురించి ఏమాత్రం సమీక్షించకుండానే గద్దె రామ్మోహన్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు తదితరులు వెళ్ళిపోయారు. దళితుడిని కాబట్టి షటప్, గెటవుట్ అంటారా.. ‘నేనొక దళిత నాయకుడిని. నన్ను షటప్, గెటవుట్ అంటారా. నాలుగు గోడల మధ్య మీరు అంటే సరిపోయిందా. బయటకు వచ్చి అందరి ముందు ఇవే మాటలు అనండ’ని తిరువూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఎస్.దేవదత్తు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేశినేని నాని, ఆయన వర్గీయులు తాను ఏర్పాటు చేసుకున్న టీడీపీ కార్యాలయానికి వచ్చి పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని తన వర్గీయులతో కలిసి పక్కనే ఉండగా దేవదత్తు మాట్లాడిన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన మాటల్లోనే.. ‘దళితుడినైన నేను ఉన్నత విద్యను అభ్యసించి, 15 సంవత్సరాలు వివిధ దేశాల్లో పనిచేసి జ్ఞానం పొందా. నేనేదో సమావేశంలో మాట్లాడబోతుంటే నా ఆఫీసుకే వచ్చి నన్ను షటప్, గెటవుట్ అని కేశినేని నాని అంటారా.. నా ఆఫీసులో నాకు మాట్లాడే హక్కు లేదా? రెండు సార్లు గెలిచిన మీకే హక్కు ఉందా? మీరేనా నియోజకవర్గ నాయకులు. మేము కాదా. మాకు అవకాశం లేదా. మాకు చెప్పుకునే అర్హత లేదా. ఇంకా ఎంతకాలం మీరు దళితులపై ఇలా హీనంగా మాట్లాడతారు. ఏడు నియోజకవర్గాలను గెలిపిస్తామంటున్నారు. ఎక్కడ గెలిపించారు. మీరు మాత్రమే గెలిచారు. తక్కినవి ఓడిపోయారు’. దాడి సంఘటనపై కేసు నమోదు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరువూరు ఎస్ఐ సతీష్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రమేష్ తెలిపారు. తిరువూరు పోలీసుస్టేషన్లో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఇరువర్గాలు దాడికి పాల్పడుతుండగా అదుపు చేయడానికి యత్నించిన ఎస్ఐ సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఎస్ఐపై దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. నిందితులను అరెస్టు చేస్తాం.. తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎస్ఐ సతీష్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేశాం. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. శాంతిభద్రతలు కాపాడటానికి యత్నించిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేయడం శోచనీయం. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం. – కాంతి రాణా టాటా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ -
టీడీపీ ఎంపీ కేశినేని నాని సోదరుల మధ్య మరోసారి వార్
-
ఉద్యోగం ఇవ్వకుంటే జయ సమాధిని పేల్చేస్తా.!
సాక్షి, చెన్నై: తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వని పక్షంలో మెరీనాతీరంలోని జయలలిత సమాధిని పెట్రోబాంబులతో పేల్చేస్తానని ఏకంగా ఓ యువకుడి డీజీపీ కార్యాలయానికి వచ్చి మరీ హెచ్చరికలు ఇచ్చాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని మానసిక వైద్య నిపుణుల వద్దకు పంపించారు. కొరుక్కుపేట భారతీరాజా హౌసింగ్ బోర్డుకు చెందిన మణిగండన్ బుధవారం మెరీనా తీరంలోని డీజీపీ కార్యాలయానికి వచ్చాడు. అక్కడి ఫిర్యాదుల విభాగం వద్దకు వెళ్లి ఓ విజ్ఞప్తిని అధికారులకు అందజేశాడు. దీనిని చదివిన అధికారులు హడలెత్తారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని లేనిపక్షంలో జయలలిత సమాధిని నాటుబాంబులతో పేల్చేస్తానని యువకుడు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అతడ్ని అదుపులోకి తీసుకుని సోదాలు చేశారు. అయితే, అతడి చర్యలు మానసిక రోగి తరహాలో ఉండడంతో మెరీనా పోలీసులకు అప్పగించారు. వారు సమగ్ర విచారణ తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో మానసిక ఒత్తిడికి గురైనట్టు తేలింది. దీంతో అతడ్ని మానసిక వైద్యుల వద్దకు పంపించారు. సీఎం ఇంటికి బాంబు బూచి.. చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డు, సేలంలోని సీఎం నివాసాల్ని బాంబులతో పేల్చి వేస్తున్నట్టు వచ్చిన బెదిరింపు కాల్ మంగళవారం రాత్రి అధికారుల్ని పరుగులు తీయించింది. ఆయన ఇంటి పరిసరాల్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు. భద్రతను పెంచారు. వేలూరు ప్రచార పర్యటన సందర్భంగా సీఎం కాన్వాయ్ వైపు ఓ కారులో తుపాకీ, నాటు బాంబులు బయటపడిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగానే వ్యవహరించారు. సోదాల తర్వాత ఇది కేవలం బెదిరింపు కాల్‌గా తేలింది. కంట్రోల్‌రూమ్‌కు వచ్చిన సెల్ నంబర్ ఆధారంగా సైబర్ క్రైం వర్గాలు తిరుప్పూర్‌కు చెందిన ఓ యువకుడ్ని బుధవారం అరెస్టు చేసి విచారిస్తున్నారు. (చదవండి: కిలాడీ దంపతులు: బండారం బట్టబయలు..) అరుదైన దృశ్యం.. ఒకేసారి మూడు పులులు -
రావయ్యా.. తలైవా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ సన్యాసం పుచ్చుకున్నట్లుగా నటుడు రజనీకాంత్ వ్యవహరించడం ఆయన అభిమానులకు నచ్చలేదు. కటిక చేదైన ఈ వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒత్తిడి తెచ్చైనా రాజకీయాల్లోకి దింపాలని ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నై వళ్లువర్‌కోట్టం వద్ద ఆదివారం మరోసారి ఆందోళన చేపట్టి రావయ్యా తలై వా అంటూ నినాదాలు చేశారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత తరహాలో రజనీకాంత్ రాజకీయాల్లో రావాలని అభిమానులు మూడు దశాబ్దాలుగా కలలుకంటున్నారు. మూడేళ్ల క్రితం రజనీసైతం సుముఖుత వ్యక్తం చేశారు. రాజకీయాలోకి రావడం ఖాయమని 2017 డిసెంబర్ 31వ తేదీన అభిమాన జనసందోహం మధ్య ప్రకటించారు. అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బుయ్యారు. (చదవండి: ఐదు నిమిషాల్లో 2 కోట్ల రూపాయలు..) అయితే రాజకీయాల్లోకి రజనీ రాక ప్రకటనకే పరిమితమైంది. మూడేళ్లుగా ఎదురుచూసి గత ఏడాది చివర్లో అభిమానులు మళ్లీ జోరుపెంచారు. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో పార్టీ మాటేమిటని అన్నివర్గాలు ఆసక్తిచూపాయి. దీంతో దిగివచ్చిన రజనీకాంత్ డిసెంబర్ 31న పార్టీ ప్రకటన, జనవరిలో పార్టీ స్థాపన అని ప్రకటించారు. ‘ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ వీలుకాదు’ అని కూడా ఆయన వ్యాఖ్యానించడంతో అందరూ గట్టిగా నమ్మారు. రజనీ ప్రకటనతో రజనీ మక్కల్ మన్రం నిర్వాహకులు, అభిమానులు పండగ చేసుకున్నారు. అన్నాత్తే చిత్రం షూటింగ్ ముగించుకు వస్తానని హైదరాబాద్ వెళ్లిన రజనీ అనారోగ్యం పాలై చెన్నైకి చేరుకున్నారు.(చదవండి: ‘నష్ట పరిహారం అడిగితే అత్యాచారం చేశారు’) ఆరోగ్యం సహకరించడం లేదు, రాజకీయ పార్టీ పెట్టడం లేదని గతనెల 29న రజనీ ప్రకటించడంతో రజనీ మక్కల్ మన్రం నిర్వాహకులు హతాశులయ్యారు. చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని ఆయన ఇంటి ముందు పోరాటాలు సాగించినా రజనీ స్పందించలేదు. ఆందోళనలకు పూనుకుంటే క్రమశిక్షణ చర్య తీసుకుంటామని రజనీ మక్కల్ మన్రం నేతల్లో కొందరు హెచ్చరించినా అభిమానులు ఖాతరు చేయలేదు. ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం చెన్నై నుంగంబాక్కంలోని వల్లువర్‌కోట్టం వద్దకు ఆదివారం ఉదయం పెద్దసంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ‘ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కుదరదు..రాజకీయాల్లో రా నాయకుడా’ అంటూ నినా దాలు చేశారు. ఆందోళన ముగిసిన తరువాత కొందరు అభిమానులు మయిలం మురుగన్ ఆలయానికి వెళ్లి గుండు కొట్టించుకున్నారు. -
కిలాడి చెల్లి: అక్క, చంటి బిడ్డను..
సాక్షి, చెన్నై: ఆస్తి కోసం తన సొంత అక్క, ఆమె చంటి బిడ్డను నరికి తగల బెట్టడమే కాకుండా, ఆత్మాహుతి చేసుకున్నట్టు నాటకం రక్తి కట్టించిన ఓ కిలాడి చెల్లి కిరాతకం గురువారం వెలుగులోకి వచ్చింది. కళ్లకురిచ్చికి చెందిన చిన్నస్వామికి సుమతి, సుజాత కుమార్తెలు. పెద్ద కుమార్తె సుమతిని సమీప బంధువు ఇలయరాజకు ఇచ్చి చిన్నస్వామి వివాహం చేశాడు. వీరికి శ్రీ నిధి అనే పాప ఉంది. సుమతికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉండడంతో ఆమెకు చిన్నస్వామి ప్రాధాన్యత ఇచ్చేవాడు. గతవారం చంటి బిడ్డ సహా సుమతి అగ్నికి ఆహుతైంది. అనారోగ్యంతో ఆత్మాహుతి చేసుకున్నట్టు కేసు ను ముగించారు. పోస్టుమార్టం నివేదికలో సుమతి, బిడ్డ శరీరంపై కత్తి గాట్లు ఉండడంతో అనుమానాలు వచ్చాయి. పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో కేడీ చెల్లెలు సుజాత గుట్టు రట్టయింది. చిన్నస్వామి పేరిట 20 సెంట్ల స్థలం ఆ గ్రామంలో ఉంది. అక్క కోసం స్థలాన్ని తండ్రి అమ్మేస్తాడో అనే ఆందోళనతో సుజాత ఉంటూ వచ్చింది. ఈ సమయంలో ఇంటికి అక్క రావడంతో తన పథకాన్ని అమలుచేయడానికి సిద్ధమైంది. నిద్రిస్తున్న సుమతి, శ్రీనిధిల్ని కత్తితో నరికి. కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మాహుతి నాటకం రక్తి కట్టించింది. కత్తి గాట్లు సుజాతను ఊచలు లెక్కించేలా చేసింది. 20 సెంట్ల స్థలం కోసం అక్కను, బిడ్డను కడతేర్చిన సుజాతపై గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఎల్లో అలర్ట్: చెన్నై ఉక్కిరిబిక్కిరి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడును మరో మూడురోజులపాటు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని చెన్నైలోని వాతావరణ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ పువియరసన్ తెలిపారు. ప్రజలను, ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికగా బుధవారం ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. తమిళనాడులో గతనెల 28న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే నాలుగురోజులు గడిచినా చెప్పుకోదగ్గ అల్పపీడన ద్రోణి ఇంతవరకు ఏర్పడలేదు. సహజమైన ఉష్ణోగ్రతల వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తొలిరోజునే చెన్నైలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. (చదవండి: విషాదం: నీ వెంటే మేమూ!) ఈనెల 2న కొత్తేరిలో గరిష్టంగా 80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతం, దానికి ఆనుకునే ఉన్న నైరుతి సముద్రం, శ్రీలంక, తూర్పు అండమాన్ దీవుల వద్ద కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా కోవై, తేని, దిండుగల్లు, మదురై, విరుదునగర్, తిరునెల్వేలి, తెన్కాశి, కన్యాకుమారి, తూత్తుకూడి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, చెన్నై దాని పరిసరాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు బలపడుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 7వ తేదీ వరకు రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తాయి. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎల్లో ఎలర్ట్‌ను ప్రకటించినట్లు పువియరసన్ తెలిపారు. (చదవండి: బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..) చెన్నై ఉక్కిరి బిక్కిరి.. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చెన్నై నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భారీ వర్షానికి నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ద్విచక్రవాహనాలు పూర్తిగా మునిగిపోగా, కార్లలో ప్రయాణించే వారు కూడా జలప్రవాహాన్ని దాటేందుకు కష్టపడ్డారు. బుధవారం ఉదయం ఆఫీసులకు, విధులకు వెళ్లే సమయంలో కుండపోత వర్షం వల్ల రోడ్లలో నడుములోతు వరద ప్రవాహంతో ప్రజలు నానాయాతన పడ్డారు. వాహనాలు ముందుకు సాగే వీలులేకపోవడంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. బెంగళూరులో వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో చెన్నై నుంచి ఆరు విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. అలాగే బెంగళూరు నుంచి చెన్నైకి రావాల్సిన రెండు విమానాల విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. -
విషాదం: నీ వెంటే మేమూ!
సాక్షి, చెన్నై: భర్త మరణించి ఏడాది అవుతున్నా ఆయన జ్ఞాపకాలు వెంటాడటంతో బతుకు భారమై ఓ భార్య ఆత్మాహుతి చేసుకుంది. వెళ్తూ..వెళ్తూ ఇద్దరు ఆడ బిడ్డలను హతమార్చింది. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌కు చెందిన రంజిత్‌కుమార్ (32), రాశి(30) దంపతులకు అక్షయ(5), అనుçసయ(3) ఉన్నారు. మెడికల్ ఏజెన్సీ నడుపుతూ వచ్చిన రంజిత్ కుమార్ గత ఏడాది అనారోగ్యంతో మరణించాడు. దీంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్త చంద్ర, మామ రామదాసు ఇంట్లో రాశి ఉంటున్నారు. రెండు రోజుల క్రితం రంజిత్‌కుమార్ సంవత్సరికం జరిగింది. ఆ రోజు నుంచి తీవ్ర మనోవేదనతో ఉంది. (చదవండి: భార్యను చంపి శవంతో స్కూటీపై 10 కి.మీ) ఈ క్రమంలో సోమవారం స్నానపు గది నుంచి వాసన రావడంతో అత్త చంద్ర వెళ్లి పరిశీలించింది. రాశి సజీవ దహనమై కనిపించింది. అనంతరం గదిలోకి వెళ్లి పిల్లలను చూడగా విగత జీవులుగా పడివున్నారు. నాగర్ కోయిల్ డీఎస్పీ వేణుగోపాల్, ఇన్స్పెక్టర్ సాయిలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంట్లో రాశి రాసిపెట్టిన లేఖ బయట పడింది. తన అన్నలు, వదినమ్మలకు ఆ లేఖ రాస్తూ, తనను క్షమించాలని.. సంవత్సరికం కోసం ఎదురు చూశానని, ఆ తంతంగం ముగిసిందని, అందుకే తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొనడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచింది. (చదవండి: బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..) -
రూ.10 కోట్లు.. చిక్కుల్లో చిన్నమ్మ
సాక్షి ప్రతినిధి, చెన్నై: శిక్షాకాలం ముగింపు దగ్గరపడింది. జరిమానా చెల్లింపే ఇంకా మిగిలింది. రూ.10 కోట్ల భారీ మొత్తం కర్ణాటక జైళ్ల ఖాతాలో జమైతే తరువాత పరిణామాలు చిన్నమ్మను చిక్కుల్లో పడేస్తాయని ఆమె వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, తలా రూ.10 కోట్ల జరిమానా విధించింది. 2017 ఫిబ్రవరి 14వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో వారంతా శిక్ష అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీతో ముగుస్తుండగా, ఖైదీల స్రత్పవర్తన కింద శశికళ ముందే విడుదలవుతారని ఆమె న్యాయవాది పలుమార్లు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహన్ సమాచార హక్కు చట్టం కింద ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని కోరినపుడు వచ్చే ఏడాది జనవరి 27న విడుదల కాగలరని జైళ్లశాఖ బదులిచ్చింది. పెరోల్‌పై బయటకు వచ్చిన రోజులను మినహాయించి స్రత్పవర్తన కింద 120 రోజుల మందే శశికళ విడుదల ఖాయమని ఆమె అభిమానులు ధీమాతో ఉన్నారు. జైలు అధికారులను మభ్యపెట్టి శశికళ బెంగళూరు నుంచి అనధికారికంగా బయటకు వచ్చి షాపింగ్‌లు చేసినట్లు గతంలో బెంగళూరు జైళ్లశాఖ డీఐజీ రూప ఆరోపించి నిరూపించినట్లు తెలుస్తోంది. స్రత్పవర్తన పరిధిలోకి శశికళ రారని కూడా అంటున్నారు. (చదవండి: ఎన్నికల్లో పోటీకి శశికళ వ్యూహరచన) జరిమానా చెల్లింపులో చిక్కులు.. స్రత్పవర్తన.. ముందస్తు విడుదల అంశాలు అటుంచితే రూ.10 కోట్ల జరిమానా చెల్లింపులో చిక్కులు తలెత్తాయి. ఇప్పటికే అనేకసార్లు ఐటీ దాడులను ఎదుర్కొన్న శశికళకు రూ.10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని మరోసారి అధికారులు ఆరాతీసే అవకాశం ఉంది. చిన్నమ్మ కోసం జరిమానా చెల్లించేందుకు ఆమె అనుచరులు కొందరు ఇప్పటికే బెంగళూరులో తిష్టవేసినట్లు తెలుస్తోంది. జరిమానా చెల్లింపు, ఆ మొత్తంపై ఐటీశాఖ నుంచి స్పష్టత, జైళ్ల శాఖ నుంచి కర్ణాటక ప్రభుత్వానికి సమాచారం. ప్రభుత్వ ఆదేశాలు...వీటన్నింటికీ మరింత జాప్యం అవకాశం ఉంది. అంతేగాక కోర్టుకు దశరా, మిలాడినబి సెలవులు ముగిసిన తరువాత వచ్చేనెల 2న శశికళ విడుదలపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆమె అభిమానులు ప్రచారం చేస్తున్నారు. అప్పుడే ఆనందోత్సాహాలు.. శశికళ విడుదల కాకుండానే ఆమె అభిమానులు ఆనందోత్సాహాలను మొదలుపెట్టారు. ‘చోళనాడు పేరాసి చిన్నమ్మ’ అనే నినాదంతో పోలీస్, రవాణాశాఖలో పనిచేసే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు శశికళ చిత్రంతో పోస్టర్లు వెలిసాయి. మదురైలోని పలు ప్రాంతాల్లో గోడలపై అంటించిన పోస్టర్లు కలకలానికి కారణమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి తమ ఫొటోలతో రాజకీయ ప్రచారాలకు దిగడాన్ని ఆయా శాఖలు సీరియస్‌గా తీసుకున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో శశికళ విడుదల రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నాడీఎంకేలో ముసలం పుట్టడం ఖాయమని ఒక వర్గం ప్రచారం సంతోషంగా ఉంది. -
భార్యను 120 కిలోమీటర్లు సైకిల్‌పై తీసుకెళ్లినా..
సాక్షి ప్రతినిధి, చెన్నై: పేదవాడైతేనేం ఆయనకు పెద్ద మనసు ఉంది. క్యాన్సర్ రోగం నుంచి భార్యను కాపాడుకోవాలన్న తపన వృద్ధాప్యాన్ని కూడా మరిచిపోయేలా చేసింది. లాక్డౌన్ వల్ల బస్సులు లేకపోవడంతో సైకిల్‌పై భార్యను ఎక్కించుకుని 120 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయినా ఫలితం లేకుండాపోయింది. భార్య ప్రాణాలు హరించింది. భర్తను కన్నీటి కడలిలోకి నెట్టేసింది. తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని మనల్‌మేడుకు చెందిన అరివళగన్ (60) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మొదటి భార్య మరణించడంతో మంజుల (44)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు విష్ణు (12) ఉన్నాడు. మంజుల ఎడమచెంపకు సమీపంలో క్యాన్సర్ వ్యాధి సోకినట్లు తొమ్మిది నెలల క్రితం గుర్తించారు. పుదుచ్చేరి జిప్మర్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. మార్చి 24వ తేదీ నుంచి లాక్డౌన్ ఉండడంతో ఆస్పత్రికి వెళ్లలేకపోయారు. ఈ పరిస్థితిలో భార్య బాధను చూసి తట్టుకోలేకపోయిన అరివళగన్ మార్చి 29వ తేదీన పాత సైకిల్‌పై ఆమెను కూర్చోబెట్టుకుని కుంభకోణం నుంచి బయలుదేరాడు. 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదు చ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రిలో చేర్పించాడు. తరువాత అంబులెన్స్‌లో ఆమెను తిరిగి స్వగ్రామానికి చేర్చా డు. భార్య ఆరోగ్యం పట్ల అతడు చూపిస్తున్న ప్రేమను గ్రామస్తులు మెచ్చుకుని తోచిన సహాయాన్ని చేశారు. ఇంట్లోనే ఉంటూ మందులు తీసుకుంటున్న మంజుల ఆదివారం రాత్రి మరణించింది. ‘లాక్డౌన్ కారణంగా ఉపాధి కరువైంది, మరోవైపు క్యాన్సర్‌తో భార్య బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళదామంటే బస్సులు లేవు. భార్య ను కాపాడుకునేందుకు సైకిల్‌పైనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. నా కష్టం వృథా పోయింది. భార్య ప్రాణా లు నిలబెట్టుకోలేక పోయాను’ అంటూ అరివళగన్ కన్నీరుమున్నీరయ్యాడు. మంజుల మరణం గ్రామ ప్రజలను సైతం తీవ్రంగా కలచివేసింది. -
భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై, విలుపురం జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వేలూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు కారణంగా పలు జిల్లాల్లో జన జీవనం స్తంభించింది. విస్తారమైన వర్షాలు కురవడంతో కొన్ని చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు నగరాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.కుండపోత గా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు లోతట్టు ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. పది జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ ప్రకటించింది. -
లాస్యకు కాబోయే వరుడు ఇతడే..
-
లాస్యకు కాబోయే వరుడు ఇతడే..
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంగేజ్మెంట్ వార్తను ఒక్కసారిగా చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది యాంకర్ లాస్య. అంతే కాకుండా భారీ సస్పెన్స్ మూవీని తలపించేలా తనకు కాబోయే జీవిత భాగస్వామి వివరాలను వెల్లడించింది. తన ఎంగేజ్మెంట్కు సంబంధించి పోస్ట్ పెట్టిన కొద్ది వ్యవధిలోనే కాబోయే భర్తకు సంబంధించి చిన్న క్లూను ఓ ఫోటో ద్వారా ఇచ్చింది లాస్య. ఒకరి చేతి పై మరొకరి ముద్దు పేరుతో పచ్చబొట్టు వేసి ఉన్న ఫోటోను లాస్య తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. చిన్ని, మంజూ అని రాసున్న ఆ రెండు చేతుల పక్కనే రెండు ఎంగేజ్ మెంట్ రింగులు కూడా ఉన్నాయి. దీన్నే లాస్య తన వాల్ పోస్ట్‌గా కూడా పెట్టింది. ఈ ఫోటోను ఫేస్ బుక్ పేజీలో పెట్టిన కొద్ది సేపటికే పెద్ద ఎత్తున లైకులు వచ్చాయి. ఎంగేజ్ మెంట్ ఎవరితో అయింది..ఈ మంజూ ఎవరు అంటూ.. అభిమానులు భారీగా కామెంట్లు చేశారు. దీనికి స్పందిచిన లాస్య విషెస్ తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలిపింది. తనకు కాబోయే జీవిత భాగస్వామికి సంబంధించి ఫోటోను సరిగ్గా ఐదు గంటలకు ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేస్తానని లాస్య పేర్కొంది. తాను చెప్పినట్టుగానే సరిగ్గా సోమవారం సాయంత్రం ఐదుగంటలకు ఎంగేజ్ మెంట్ ఫోటోలను విడుదల చేసింది. అయితే ఆదివారం రోజే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగిందని పేర్కొంది. మంజూనాథ్ మరాఠీ అబ్బాయని తెలిపింది.