
గాయపడిన కృష్ణ
టెక్కలి రూరల్ శ్రీకాకుళం : బీఎస్‌జేఆర్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి తిరునగరి కృష్ణ దేశభక్తికి సంబంధించిన పాటకు డ్యాన్స్ చేసేందుకు తను సొంతంగా ఒక తుపాకీని తయారు చేసుకుని సిద్ధమయ్యాడు. అయితే తను డ్యాన్స్ మొదలు పెట్టేముందు తను తాయారు చేసుకున్న తుపాకీలో బాంబ్ పెట్టి తన ఛాతిపై గన్ మోపి పేల్చబోయాడు.
ప్రమాదవశాత్తు బాంబ్ తన ఛాతిపై కుడివైపునకు జారి పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కృష్ణకు తీవ్రగాయాలు అవ్వడంతో హుటాహుటీన విద్యార్థులు టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మహరాజ్ సిటీ స్కాన్ తీసి గుండెకు దగ్గరగా కుడివైపు గాయం కావడంతో పరిస్థితి విషమంగా మారే ప్రమాదం ఉందని తెలుపుతూ మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కాగా, గాయపడిన విద్యార్థిది నందిగాం మండలంలోని రౌతుపురం గ్రామం.
Comments
Please login to add a commentAdd a comment