
Punjab Ludhiana Court Blast: పంజాబ్‌లో లూథియానాలోని కోర్టు కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. భవనంలో రెండో అంతస్తులోని బాత్‌రూమ్‌లో పేలుడు సంభవించిందని అధికారులు అన్నారు. పైగా పేలుడు తీవ్రతకు బాత్రూమ్ గోడలు దెబ్బతిన్నడమే కాక సమీపంలోని అద్దాలు కూడా పగిలిపోయాయి అని చెప్పారు. అయితే పేలుడు సంభవించిన సమయంలో జిల్లా కోర్టు పనిచేస్తోందని చెప్పారు. పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది.
(చదవండి: హ్యాట్సాఫ్!..కుక్కని భలే రక్షించాడు)
అయితే అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. పైగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌కు చెందిన బాంబు డేటా సెంటర్‌కు చెందిన బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. ఈ మేరకు పేలుడు ఎలా సంభవించిందో విచారించడానికి చండీగఢ్ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) బృందం లూథియానా జిల్లా కోర్టుకు రానున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పంజాబ్ పోలీసులను ఈ ఘటన గురించి సత్వరమే విచారణ చేపట్టాలని ట్విట్టర్‌లో కోరారు. అంతేకాదు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ మేరకు చన్నీ మాట్లాడుతూ..."ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని పంజాబ్ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.
(చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment