Ludhiana court
-
లుథియానా కోర్టు పేలుడు కేసు... జర్మనీలో సూత్రధారి పట్టివేత
న్యూఢిల్లీ: లూథియానా జిల్లా కోర్టులో సంభవించిన బాంబు పేలుడు దర్యాప్తులో లోతుల్లోకి వెళ్లి కూపీ లాగిన భారత దర్యాప్తు సంస్థలు సూత్రధారిని పట్టుకోవడంలో సఫలమయ్యాయి. వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహించే సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ఐ) సంస్థకు చెందిన ఉగ్రవాది జస్విందర్ సింగ్ ముల్తానీని భారత నిఘా వర్గాల సమాచారంతో జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23న లూథియానా కోర్టు రెండో అంతస్తులో బాంబు పేలిన విషయం తెల్సిందే. మాజీ కానిస్టేబుల్ గగన్‌దీప్ బాంబును అమర్చుతుండగా పేలి అతను మరణించాడు. ఎన్నికల వేళ పంజాబ్‌లో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు పాకిస్తాన్ గడ్డపై నుంచి ఖలిస్థాన్ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలియడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు దీన్ని సీరియస్‌గా తీసుకొన్నాయి. గగన్‌దీప్... జస్విందర్ సింగ్ ముల్తానీతో నిరంతరం సంప్రదింపులు జరిపాడని గుర్తించాయి. దాంతో ఇతనిపై పంజాబ్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భారత్ తమ రాయబార కార్యాలయం ద్వారా జర్మనీ పోలీసులకు తగిన ఆధారాలను సమర్పించడంతో వారు ఎర్ఫర్ట్ పట్టణంలో ముల్తానీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని పేలుడు పదార్థాలు, హ్యాండ్ గ్రెనేడ్లను పాక్ మీదుగా భారత్‌లోకి పంపే ప్రయత్నాల్లో ముల్తానీ ఉన్నాడని, పంజాబ్‌లో మళ్లీ పేలుళ్లకు కుట్ర చేస్తున్నాడని భారత ఏజెన్సీలు గుర్తించాయి. ఖలిస్థానీ అగ్రనేతలతో ముల్తానీకి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. -
పంజాబ్ కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు: ఇద్దరు మృతి
Punjab Ludhiana Court Blast: పంజాబ్‌లో లూథియానాలోని కోర్టు కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. భవనంలో రెండో అంతస్తులోని బాత్రూమ్లో పేలుడు సంభవించిందని అధికారులు అన్నారు. పైగా పేలుడు తీవ్రతకు బాత్రూమ్ గోడలు దెబ్బతిన్నడమే కాక సమీపంలోని అద్దాలు కూడా పగిలిపోయాయి అని చెప్పారు. అయితే పేలుడు సంభవించిన సమయంలో జిల్లా కోర్టు పనిచేస్తోందని చెప్పారు. పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. (చదవండి: హ్యాట్సాఫ్!..కుక్కని భలే రక్షించాడు) అయితే అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. పైగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌కు చెందిన బాంబు డేటా సెంటర్‌కు చెందిన బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. ఈ మేరకు పేలుడు ఎలా సంభవించిందో విచారించడానికి చండీగఢ్ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బృందం లూథియానా జిల్లా కోర్టుకు రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పంజాబ్ పోలీసులను ఈ ఘటన గురించి సత్వరమే విచారణ చేపట్టాలని ట్విట్టర్లో కోరారు. అంతేకాదు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ మేరకు చన్నీ మాట్లాడుతూ..."ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని పంజాబ్ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. (చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?) -
రాఖీకి నాన్ బెయిలబుల్ వారంట్
లూథియానా: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీకి కోర్టు నోటిసులు జారీచేసింది. రాఖీ సావంత్ పవిత్ర రామాయణాన్ని రచించిన వాల్మీకిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన లూథియానా కోర్టు, రాఖీ సావంత్‌కు గురువారం నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ విషవ్ గుప్తా ఈ కేసు విచారణను జూన్ 2కు వాయిదా వేశారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని గత ఏడాది జూలై 9న స్థానిక న్యాయవాది నరీందర్ అదియా, రాఖీ సావంత్‌పై పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును ఏప్రిల్ 10న ఆమె ఉపసంహరించుకున్నారు. మార్చి 9న ఆమెపై కోర్టు అరెస్టు వారంట్ జారీ చేయగా ఆమెను అరెస్టు చేయడానికి ఏప్రిల్‌లో ముంబై వెళ్లిన ఇద్దరు పోలీసు అధికారుల బృందం ఉత్త చేతులతో తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. -
చిక్కుల్లో బాలీవుడ్ నటి
లుధియానా: రాజకీయ నాయకురాలిగా మారిన బాలీవుడ్ తార రాఖీ సావంత్ కు మరోసారి చిక్కులు ఎదురయ్యాయి. మహర్షి వాల్మికిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమెకు లుధియానా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న తమ ఎదుట హాజరుకావాలని జ్యుడీషియల్ మేజిస్ట్రేల్ ఆదేశించారు. స్థానిక న్యాయవాది నరీందర్ ఆదియా ఫిర్యాదు మేరకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ ఇంటర్వ్యూలో మహర్షి వాల్మికిపై రాఖీ సావంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ ఆరోపించారు. ఇంటర్వ్యూ వీడియోను సోషల్ మీడియాలోనూ పెట్టారని చెప్పారు. తన మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంటూ ఆమెపై వాల్మికి సామాజిక వర్గానికి చెందిన వారు ఈనెల 22న జలంధర్ లోని రామమండి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఆమెపై 295(ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాఖీ సావంత్ కు వ్యతిరేకంగా వాల్మికి సామాజిక సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టాయి. ఆమె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ నుంచి వచ్చిన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలును వాల్మికి టైగర్ ఫోర్స్ కార్యకర్తలు అడ్డుకున్నారు.