రాఖీకి నాన్ బెయిలబుల్ వారంట్
లూథియానా: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీకి కోర్టు నోటిసులు జారీచేసింది. రాఖీ సావంత్ పవిత్ర రామాయణాన్ని రచించిన వాల్మీకిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన లూథియానా కోర్టు, రాఖీ సావంత్‌కు గురువారం నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ విషవ్ గుప్తా ఈ కేసు విచారణను జూన్ 2కు వాయిదా వేశారు.
ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని గత ఏడాది జూలై 9న స్థానిక న్యాయవాది నరీందర్ అదియా, రాఖీ సావంత్‌పై పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును ఏప్రిల్ 10న ఆమె ఉపసంహరించుకున్నారు. మార్చి 9న ఆమెపై కోర్టు అరెస్టు వారంట్ జారీ చేయగా ఆమెను అరెస్టు చేయడానికి ఏప్రిల్‌లో ముంబై వెళ్లిన ఇద్దరు పోలీసు అధికారుల బృందం ఉత్త చేతులతో తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది.