చిక్కుల్లో బాలీవుడ్ నటి | Ludhiana Court summoned actress Rakhi Sawant | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో బాలీవుడ్ నటి

Published Thu, Jul 28 2016 9:39 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

చిక్కుల్లో బాలీవుడ్ నటి

చిక్కుల్లో బాలీవుడ్ నటి

లుధియానా: రాజకీయ నాయకురాలిగా మారిన బాలీవుడ్ తార రాఖీ సావంత్ కు మరోసారి చిక్కులు ఎదురయ్యాయి. మహర్షి వాల్మికిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమెకు లుధియానా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న తమ ఎదుట హాజరుకావాలని జ్యుడీషియల్ మేజిస్ట్రేల్ ఆదేశించారు. స్థానిక న్యాయవాది నరీందర్ ఆదియా ఫిర్యాదు మేరకు కోర్టు సమన్లు జారీ చేసింది.

ఓ ఇంటర్వ్యూలో మహర్షి వాల్మికిపై రాఖీ సావంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ ఆరోపించారు. ఇంటర్వ్యూ వీడియోను సోషల్ మీడియాలోనూ పెట్టారని చెప్పారు. తన మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంటూ ఆమెపై వాల్మికి సామాజిక వర్గానికి చెందిన వారు ఈనెల 22న జలంధర్ లోని రామమండి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఆమెపై 295(ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

రాఖీ సావంత్ కు వ్యతిరేకంగా వాల్మికి సామాజిక సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టాయి. ఆమె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ నుంచి వచ్చిన శతాబ్ధి ఎక్స్ప్రెస్ రైలును వాల్మికి టైగర్ ఫోర్స్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement