Maharishi Valmiki
-
అయోధ్య ఎయిర్‌పోర్టుకు మహర్షి వాల్మికి పేరు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు–అయోధ్యధామ్’ అని పేరుపెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలని కూడా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. రైల్వేలో ‘సున్నా కర్బన ఉద్గారాల’ లక్ష్యాన్ని సాధించడానికి అమెరికాతో ఒప్పందానికి అనుమతించింది. మారిషస్ భాగస్వామ్యంతో ఉమ్మడిగా బుల్లి ఉపగ్రహం అభివృద్ధికి అవగాహనా ఒప్పందానికి కూడా అంగీకరించింది. ‘పృథ్వీ విజ్ఞాన్’కు ఆమోదం ఎర్త్ సైన్సెస్ రంగంలో ఐదు వేర్వేరు పథకాల కింద పరిశోధనలకు, కేటాయించిన నిధుల వినియోగానికి ఉద్దేశించిన ‘పృథ్వీ విజ్ఞాన్’కు కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని అమలుకు రూ.4,797 కోట్లు కేటాయించింది. ఇది ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. వాతావరణం, సముద్రం, క్రయోస్పియర్, పోలార్ సైన్స్, సీస్మాలజీ, జియోసైన్సెస్ వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. పృథ్వీ విజ్ఞాన్ కింద రీసెర్చ్ ప్రాజెక్టులను విదేశీ సంస్థలకు అప్పగించడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గయానా నుంచి ముడి చమురు కొనుగోలుతో పాటు హైడ్రో కార్బన్ రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం కుదుర్చుకునేందుకూ అంగీకరించింది. గయానాలో ముడి చమురు అన్వేషణ, ఉత్పత్తిలో భారతీయ కంపెనీలకు సైతం భాగస్వామ్యం కలి్పస్తారు. ప్రపంచ దేశాలతో అయోధ్య అనుసంధానం: మోదీ అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలపడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని వాల్మికి మహర్షికి దేశ ప్రజల తరపున ఘనమైన నివాళిగా అభివరి్ణంచారు. అయోధ్యను ప్రపంచ దేశాలతో అనుసంధానించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. -
చిక్కుల్లో బాలీవుడ్ నటి
లుధియానా: రాజకీయ నాయకురాలిగా మారిన బాలీవుడ్ తార రాఖీ సావంత్ కు మరోసారి చిక్కులు ఎదురయ్యాయి. మహర్షి వాల్మికిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమెకు లుధియానా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న తమ ఎదుట హాజరుకావాలని జ్యుడీషియల్ మేజిస్ట్రేల్ ఆదేశించారు. స్థానిక న్యాయవాది నరీందర్ ఆదియా ఫిర్యాదు మేరకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ ఇంటర్వ్యూలో మహర్షి వాల్మికిపై రాఖీ సావంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ ఆరోపించారు. ఇంటర్వ్యూ వీడియోను సోషల్ మీడియాలోనూ పెట్టారని చెప్పారు. తన మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంటూ ఆమెపై వాల్మికి సామాజిక వర్గానికి చెందిన వారు ఈనెల 22న జలంధర్ లోని రామమండి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఆమెపై 295(ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాఖీ సావంత్ కు వ్యతిరేకంగా వాల్మికి సామాజిక సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టాయి. ఆమె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ నుంచి వచ్చిన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలును వాల్మికి టైగర్ ఫోర్స్ కార్యకర్తలు అడ్డుకున్నారు. -
పిల్లలకు క్షమాపణ చెప్పకూడదు!
విద్య - విలువలు అన్నీ నాకు తెలుసు-అన్న భావన అహంకారానికి కారణమౌతుంది. శంకరాచార్యుల వారు భగవంతుడిని గురించి ప్రార్థన చేయవలసివస్తే మొదట-’’అవినయమపనయ విష్ణో..’’ అంటారు. అంటే ‘‘శంకరా నాకు అవినయాన్ని తీసెయ్. వినయాన్ని కటాక్షించు’’ అని ప్రార్థిస్తారు. అవినయం అంటే అహంకారం. అలాగే వినయం ఎక్కడ ఉండాలో అది అక్కడ అలా ఉండాలి. ఎక్కడ వినయం ప్రదర్శించకూడదో అక్కడ ప్రదర్శించకూడదు. ఇది కూడా చాలా అవసరం. వినయమన్న మాటలోనే దాని అంతర్భావం దాగి ఉంది. ఉదాహరణకు నా కుమారుడిని నేను నిష్కారణంగా కోప్పడ్డాననుకోండి. నిష్కారణంగా అంటే పొరపాటున అని. నా కలం అక్కడ పెట్టుకున్నాను. అది కనబడలేదు. నా కుమారుడు తీసి ఉంటాడన్న అనుమానంతో వాడిని చెడామడా తిట్టాను తీరా కాసేపాగిన తరువాత ఏదో వెదుకుతూ ఉంటే అంతకుమునుపు నేను సగం చదివి పెట్టిన ఒక పుస్తకంలో అది కనబడింది. అయ్యో పాపం, అనవసరంగా తిట్టానే వాణ్ణి. ఏడ్చాడు కూడా’’. అనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి? నేను చాలా వినయశీలిని కనుక పిల్లలైనా, పెద్దలైనా నావల్ల తప్పు జరిగితే క్షమాపణ అడగాలనుకుని వాడి చేయి పట్టుకుని ’నాన్నా చాలా సారీ రా’’ అని అనాలి. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే నా వినయం అవతలివాడి అవినయానికి కారణం కాకూడదు. రేప్పొద్ద్దున మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా కనబడక వాడిని అడిగితే ’అస్తమాను ఇలా అంటారేమిటి నాన్నా, వెళ్ళి ఏ పుస్తకంలో పెట్టుకున్నారో చూసుకోండి’’ అని వాడు నన్ను అనకూడదు. నేను ఎవరికి క్షమాపణ చెప్పాలంటే ‘‘ఈశ్వరా! ఈవేళ పుస్తకంలో కలం పెట్టుకున్న సంగతి మరిచి నా కుమారుడిని నిష్కారణంగా నిందించాను. వాడు ఏడ్చాడు. వాడిని బాధపెట్టాను. నన్ను మన్నించండి’’ అని వేడుకోవాలి. లేదా నా తల్లిదండ్రులు జీవించి ఉంటే, నా కుమారుడు చూడకుండా వెళ్ళి వారికి చెప్పుకోవాలి. దీనివల్ల కిందివాడి వినయం నిలబడుతుంది. నేను వినయంగా ఉండడం అవతలివాడి అవినయానికి ఎప్పుడూ కారణం కాకూడదు. నాకు తెలిసిన ఒక ఉన్నతాధికారికి కోపమొస్తే అవతలి వాళ్ళను భయపెడుతుండేవాడు. బెల్ కొట్టి మేనేజర్ని పిలిచి ‘‘వీడి పర్సనల్ ఫైల్ పట్రండి. వీడి సంగతి చెప్తా. వారం రోజుల్లో తెలిసొస్తుంది’’ అనేవాడు. అవతలివాడు హడిలిపోయి వెళ్ళిపోయేవాడు. వాడు వెళ్ళిన పదినిమిషాలకే బెల్ కొట్టి మేనేజర్ని పిలిచి ఆ ఫైల్ తీసికెళ్ళిపొమ్మని చెప్పేవాడు. సార్ ఏం చేశాడని వాణ్ణి అంతలా భయపెట్టేశారని అడిగితే..‘‘వాడిని దెబ్బతీయడం చాలా తేలికండి. వీడి ఆశంతా డబ్బే కనుక ఒక ఇంక్రిమెంట్ కట్ చేయవచ్చు. వీడి క్రమశిక్షణారాహిత్యానికి ఫైల్ అడ్డుపెట్టుకుని వీడిని మార్చాలి తప్ప వీడిని నమ్ముకున్న కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తే ఎలా? నోరు చేసుకున్నా ఆలోచించి చేస్తానండోయ్. అలా తొందరపడి చర్య తీసుకోను సుమా. ఇదంతా వ్యవస్థను చక్కదిద్దడానికే.’’ అనేవాడు. నేను ఆయన పరిణతిని చూసి ఆశ్చర్యపోయే వాడిని. వ్యవస్థను చక్కబరచడానికి ‘క్రోధమాహారయత్’ అంటాడు వాల్మీకి మహర్షి. అంటే కోపాన్ని తెచ్చిపెట్టుకోవాలి తప్ప దానికి వశపడకూడదు-అని. ఒకసారి కోపానికి వశపడి పోయాడనుకోండి, ఇక వాడేమైపోతాడనేది ఎవరూ చెప్పలేరు. ఒకసారి క్రోధం గనుక ఆవహించిందా ఎవరూ పట్టుకోలేరు, గురువును కూడా చంపేస్తాడు. సర్వకా లాలలో మనుష్యజన్మ ఎత్తినవాడికి సంస్కారమనే మాటలో అత్యంత ప్రధానమైనదేది - అంటే వినయం కలిగి ఉండుట అంటే తలవంచగలిగి ఉండుట. ’పెద్దలపొడగన్న భృత్యుని కైబడి చేరి నమస్కృతుల్ చేయువాడు’ ఎవరైనా పెద్దలు ఎదురైతే ఒక సేవకుడు ఎలా నమస్కారం చేస్తాడో ప్రహ్లాదుడు అలా నమస్కారం చేసేవాడట. ఇప్పటికీ మనం గమనిస్తే పెద్దలైనవారి జీవితాల్లో వాళ్ళు పాటించినన్ని నియమాలు, వాళ్ళు చూపించినంత గౌరవం, వాళ్ళు అలవరచుకున్నంత వినయం వాళ్ళని అంతటి పైస్థాయికి తీకెళ్ళి నిలబెట్టాయనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో రామకృష్ణావధాన్లుగారని గొప్పవేద పండితుడున్నాడు. వారి కిప్పుడు 80 ఏళ్ళు. సందర్భవశాత్తూ వారి గురువుగారిని ఆయన ప్రస్తావించిన ప్రతిసారీ ఆయన కళ్ళవెంట, ముక్కుల వెంట నీళ్ళు ధారగా ప్రవహిస్తాయి. గొంతు గాద్గదికమౌతుంది. గురువుగారితో ఆయనకున్న అనుబంధం అది. ఒకసారి తుపాను వచ్చి యానాం అంతా కొట్టుకుపోయింది. ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఒక సంపన్నుడొచ్చి డబ్బిస్తే ‘‘ఒరే నాయనా, నేను పందిట్లో ఉన్నా ఫరవాలేదు’’ అని పక్కనే ఉన్న శివాలయాన్ని ఉద్ధరింపచేసాడు. అయినా ఆ సంపన్నుడు మళ్ళీ వచ్చి డబ్బు కట్ట అక్కడ పెట్టబోతే...’’దీనికంటే వీలయితే నాకు ఇంకొక విద్యార్థిని అప్పచెప్పు. వాడికి వేదం చెబితే ఈ జీవితానికి సార్థకత. ఆ వేదమంత్రాలతో వాడు ఊరికి ఉపకారం చేస్తాడు. మా గురువుగారిలా నేను ఓ పదిమందికి పాఠం చెబితే చాలు.’’ అన్నాడు. అప్పటికీ ఇప్పటికీ అదే వినయం, అదే విధేయత. ఇంతంత పాండిత్యం ఉన్న వారికి ఇంతంత పెద్ద పెద్దపదవుల్లో ఉన్న వారికి ఇంత వినయమా అని ఆశ్చర్యమేస్తుంది. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందనే సామెత ఉత్తిగా రాలేదు. ఈ లోకంలో వినయానికి పరాకాష్ఠ హనుమ. ఆ తర్వాత శంకర భగవత్పాదులు. హనుమంతుడిని స్మరిస్తే చాలు, అన్ని సద్గుణాలూ అబ్బుతాయి. హనుమ నాకొరకు’ అని జీవితం మొత్తంమీద చేసుకున్న పని ఒక్కటీ లేదు. చివరికి పెళ్ళికూడా అంతే. ఆయన ఎంత వేగంగా వెళ్ళగలడో అంత నిశ్చలంగా కూర్చొని ధ్యానం చేయగలడు. ఎంతటి శక్తిమంతుడో అంతటి వినయశీలి, అంతటి ఇందియ నిగ్రహం కల్గినవాడు ఆదర్శప్రాయుడు. -
మహనీయులను మరిచిపోతున్నాం
ఇందూరు, న్యూస్‌లైన్ : ‘అఖండ భారతదేశంలో మహార్షి వాల్మీకీ లాంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు.. వారిని స్మరించుకోకుండా, వారు చూపిన అడుగుజాడల్లో నడవకుండా.. వారినే మరిచిపోతున్నాం.. ఇది అత్యంత బాధాక ర విషయం’ అని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఏర్పడడానికి ముఖ్యకారణం పాశ్చాత్య సంస్కృతికు అలవాటు పడడమే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నూతన అంబేద్కర్ భవన్లో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో వాల్మీకీ జయంతి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. వాల్మీకీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మొ దటిసారిగా వాల్మీకీ జయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా గొప్పవిషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించడం అనందించదగ్గ విషయమన్నారు. ఎంతోమంది గొప్ప మేధావులు, మహాపురుషులు పుట్టిన ఈ దేశంలో, మన దేశ సంసృ్కతిని తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నామన్నారు. కనీసం మనకు పుట్టిన పిల్లలకు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. వారికి వాల్మీకీ అంటే ఎవరో తెలియదన్నారు. దేశ సంసృ్కతి, గొప్ప వ్యక్తులు, మహా పురుషుల గురించి చె ప్పాల్సిన అవసరం మనపై ఉందన్నారు. ఇలాంటి పరి స్థితి ఎదురుకాకుండా ఉండడానికి ప్రభుత్వం గొప్ప వ్యక్తుల జయంతి వేడుకలను నిర్వహిస్తోందన్నారు. వాల్మీకీ ఒక కూలానికి చెందిన వ్యక్తి కాదని సా మాన్య మానవుడేనన్నారు. రామాయణం రాసిన మొ ట్టమొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచి, గత చరిత్రను మనకు తెలియజేశారన్నారు. 24వేల శ్లోకాలు రాసి, ఆదికవిగా పేరు పొందారన్నారు. ఒక సంఘటన ద్వారా తన జీవితంలో మార్పు చోటు చేసుకుని ఇంతటి స్థా యికి ఎదిగారని, ఆయన జీవిత చరిత్ర అందరికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం బీసీ సంఘాల సొసైటీల అభివృద్ధికి జిల్లాకు వంద యూనిట్ల రుణాలను మంజూరు చేసిం దని, కాని ఒక్క దరఖాస్తు కూడా రాలేదన్నారు. ఉత్సాహవంతులు ముం దుకు వచ్చి రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఏటా నిర్వహించాలి... -వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ వాల్మీకీ జయంతి ఉత్సవాలను మొదటిసారిగా ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. ప్రతి సారి నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. దేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తుల జయంతిలను నిర్వహించాలని, ఇందుకు ప్ర త్యేక నిధులు ఇవ్వాలని కోరారు. బీసీ సంఘాల అభివృద్ధి కోసం మరో వంద యూనిట్లను మంజూరు చే యాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి విమలదేవి, బీసీ కార్పొరేషన్ ఇన్చార్జి అధికారి సత్యనారాయణ, జిల్లా వాల్మీకీ సంఘం అధ్యక్షుడు నర్సింలు, బీసీ సంఘం నాయకులు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.