ఇందూరు, న్యూస్‌లైన్ : ‘అఖండ భారతదేశంలో మహార్షి వాల్మీకీ లాంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు.. వారిని స్మరించుకోకుండా, వారు చూపిన అడుగుజాడల్లో నడవకుండా.. వారినే మరిచిపోతున్నాం.. ఇది అత్యంత బాధాక ర విషయం’ అని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఏర్పడడానికి ముఖ్యకారణం పాశ్చాత్య సంస్కృతికు అలవాటు పడడమే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నూతన అంబేద్కర్ భవన్‌లో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో వాల్మీకీ జయంతి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. వాల్మీకీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మొ దటిసారిగా వాల్మీకీ జయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా గొప్పవిషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించడం అనందించదగ్గ విషయమన్నారు. ఎంతోమంది గొప్ప మేధావులు, మహాపురుషులు పుట్టిన ఈ దేశంలో, మన దేశ సంసృ్కతిని తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నామన్నారు. కనీసం మనకు పుట్టిన పిల్లలకు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. వారికి వాల్మీకీ అంటే ఎవరో తెలియదన్నారు. దేశ సంసృ్కతి, గొప్ప వ్యక్తులు, మహా పురుషుల గురించి చె ప్పాల్సిన అవసరం మనపై ఉందన్నారు. ఇలాంటి పరి స్థితి ఎదురుకాకుండా ఉండడానికి ప్రభుత్వం గొప్ప వ్యక్తుల జయంతి వేడుకలను నిర్వహిస్తోందన్నారు.
వాల్మీకీ ఒక కూలానికి చెందిన వ్యక్తి కాదని సా మాన్య మానవుడేనన్నారు. రామాయణం రాసిన మొ ట్టమొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచి, గత చరిత్రను మనకు తెలియజేశారన్నారు. 24వేల శ్లోకాలు రాసి, ఆదికవిగా పేరు పొందారన్నారు. ఒక సంఘటన ద్వారా తన జీవితంలో మార్పు చోటు చేసుకుని ఇంతటి స్థా యికి ఎదిగారని, ఆయన జీవిత చరిత్ర అందరికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
ప్రభుత్వం బీసీ సంఘాల సొసైటీల అభివృద్ధికి జిల్లాకు వంద యూనిట్ల రుణాలను మంజూరు చేసిం దని, కాని ఒక్క దరఖాస్తు కూడా రాలేదన్నారు. ఉత్సాహవంతులు ముం దుకు వచ్చి రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి ఏటా నిర్వహించాలి...
-వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ
వాల్మీకీ జయంతి ఉత్సవాలను మొదటిసారిగా ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. ప్రతి సారి నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. దేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తుల జయంతిలను నిర్వహించాలని, ఇందుకు ప్ర త్యేక నిధులు ఇవ్వాలని కోరారు. బీసీ సంఘాల అభివృద్ధి కోసం మరో వంద యూనిట్లను మంజూరు చే యాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి విమలదేవి, బీసీ కార్పొరేషన్ ఇన్‌చార్జి అధికారి సత్యనారాయణ, జిల్లా వాల్మీకీ సంఘం అధ్యక్షుడు నర్సింలు, బీసీ సంఘం నాయకులు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయులను మరిచిపోతున్నాం
Published Sat, Oct 19 2013 3:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement
Advertisement