బాలీవుడ్‌ నటికి సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే? | Rakhi Sawant Struggles To Walk After Tumour Surgery | Sakshi
Sakshi News home page

నొప్పితో విలవిల్లాడిన నటి.. ఇదంతా డ్రామానే అంటున్న మాజీ భర్త

Published Tue, May 28 2024 4:32 PM | Last Updated on Tue, May 28 2024 4:44 PM

Rakhi Sawant Struggles To Walk After Tumour Surgery

బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ ఇటీవలే సర్జరీ చేయించుకుంది. తన గర్భాశయంలో భారీ కణతి ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆపరేషన్‌ చేసి దాన్ని తొలగించారు. ఇది జరిగి 10 రోజులు అవుతుండగా ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. తాజాగా రాఖీ వైద్య పరిస్థితిని తెలుపుతూ ఆమె మాజీ భర్త రితేశ్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఆమె మళ్లీ మనలో ఒకరిగా తిరగనుంది. తను నడవగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది అని రాసుకొచ్చాడు. 

బాధలో ఉంటే నవ్వులాటగా ఉందా?
ఈ వీడియోలో రాఖీ అడుగు తీసి అడుగు వేయడానికి కూడా చాలా కష్టపడుతోంది. ఆ నొప్పిని భరించలేకపోతోంది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా రాఖీ సర్జరీ చేయించుకోబోతుందన్నప్పుడు చాలామంది వెటకారంగా మాట్లాడారు. తనను దూషించారు. అలాంటివారిపై రితేశ్‌ తీవ్రంగా మండిపడ్డాడు. ఒకరు బాధలో ఉంటే చూసి నవ్వడానికి మనసెలా వస్తుందో.. ఈ సమయంలో కూడా తనమీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. 

మీరసలు మనుషులు కాదు
అవతలివారి కష్టాన్ని అర్థం చేసుకోవడానికి బదులు ఎగతాళి చేస్తున్నవాళ్లు అసలు మనుషులే కాదు అని ఆగ్రహించాడు. రాఖీ పొట్టలో నుంచి తీసిన గడ్డను సైతం చూపిస్తూ.. ఇది ఎంత పెద్ద కణతో చూశారా? రాఖీకి మేమంతా ఉన్నాం అని చెప్పుకొచ్చాడు. అయితే రాఖీ రెండో మాజీ భర్త మాత్రం ఇదంతా డ్రామానే అని కొట్టిపారేశాడు. లీక్‌డ్‌ వీడియోల కేసులో నుంచి తప్పించుకోవడానికే ఆపరేషన్‌ అని డ్రామా ఆడుతోందని విమర్శించాడు.

 

 

చదవండి: సన్‌ ఫ్లవర్‌లా స్టార్‌ హీరోయిన్‌.. ఆ డ్రెస్సు ఎంతకు అమ్మిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement