సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ కొందరు మాత్రం వివాహం తర్వాత కూడా స్టార్ యాక్టర్ స్టేటస్ అందుకుంటారు. ఇండస్ట్రీలో మహారాణిగా వెలుగొందుతారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇందుకు ఉదాహరణ. రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ అందుకున్న దీపిక ఇటీవలే ప్రెగ్నెన్సీ ప్రకటించింది.
బేబీ బంప్‌తో బ్యూటీ
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్లి బేబీ బంప్‌తో ప్రత్యక్షమైంది. అయితే కొందరు జనాలు అది నిజమైన బేబీ బంప్ కాదని, తను సరోగసి విధానాన్ని ఎంచుకుందని అనుమానించారు. అందులో ఏమాత్రం నిజం లేదంటూ దీపిక ఇటీవలే తన సొంత ఫ్యాషన్ బిజినెస్ 82 ఈస్ట్ ఆఫ్‌లైన్ స్టోర్‌లో మరోసారి బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది. ఆ సమయంలో తను పసుపు రంగు గౌనులో మెరిసిపోయింది.
నిమిషాల్లో అమ్ముడుపోయిన గౌన్
సోమవారం ఈ గౌనును ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. ధర రూ.34,000! కేవలం 20 నిమిషాల్లోనే ఆ డ్రెస్ అమ్ముడుపోయింది. దీంతో దీపిక ఆ డ్రెస్ సోల్డ్ అవుట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫోటో షేర్ చేసింది. ఈ డ్రెస్సును అమ్మగా వచ్చిన రూ.34,000 చారిటీకి ఇవ్వనున్నారు. ద లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌కు ఈ డబ్బు అందజేయనున్నారు. దీపికలాగే ఆమె ఆలోచనలు కూడా ఎంతో అందంగా ఉంటాయంటున్నారు అభిమానులు.
చదవండి: 'పుష్ప' విలన్‌కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?
Comments
Please login to add a commentAdd a comment