'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే బయటపెట్టాడు. 41 ఏళ్ల వయసులో ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య తనకు నిర్ధారణ అయినట్లు చెప్పాడు. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలోనే పాల్గొన్న ఫహాద్.. తనకున్న సమస్యకి చికిత్స కోసం డాక్టర్ సలహా అడిగాడు.
(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)
చిన్నతనంలో ఈ వ్యాధి బయటపడితే దీన్ని నయం చేయొచ్చని, కానీ తాను 41 ఏళ్ల వయసులో దీని బారిన పడ్డాడని ఫహాద్ చెప్పుకొచ్చాడు. దీంతో తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని అన్నాడు. ఇకపోతే ఈ వ్యాధి రావడం వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 'పుష్ప'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలిభాగంలో చాలా తక్కువ సేపు కనిపించాడు. కానీ ఆగస్టు 15న రాబోతున్న 'పుష్ప 2'లో మాత్రం ఎక్కువగానే ఉండబోతున్నాడు. ఇప్పటికే ఇతడి సీన్స్ షూటింగ్ పూర్తయింది. మరోవైపు రీసెంట్‌గా 'ఆవేశం' అనే మలయాళ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. రూ.30 కోట్లతో తీసిన ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment