నటి రాఖీ సావంత్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే నెటిజన్స్‌కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో స్పెషల్ సాంగ్స్‌కి కేరాఫ్‌గా నిలిచింది. తనదైన అందం, అభినయంతో బాలీవుడ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత అవకాశాలు తగ్గడంతో రాఖీ పేరు అంతా మర్చిపోయారు. దీంతో కొంతకాలం పాటు సైలెంట్‌గా ఉండి.. హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షోతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో రాఖీ చేసిన సందడి, కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బయటకు వచ్చిన తర్వాత ఆమెకు నెట్టింట మంచి ఆదరణ లభించింది. ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అయింది. కాంట్రవర్సీ పోస్ట్‌లతో హల్‌చల్ చేసింది.
(చదవండి: డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది: మంచు లక్ష్మి)
అయితే గత కొన్నాళ్లుగా మాత్రం రాఖీ కాస్త సైలెంట్ అయిపోయింది. దానికి కారణం ఆమె అనారోగ్యం బారిన పడడమే. ప్రస్తుతం ఈ బ్యూటీ దుబాయ్‌లో ఉంటూ చికిత్స పొందుతోంది. ఆ మధ్య శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ బ్యూటీ తన ఆరోగ్య విషయాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది.
(చదవండి: రొమాంటిక్ ఫొటోలతో ప్రియుడ్ని పరిచయం చేసిన బ్యూటీ)
‘నాకు శస్త్ర చికిత్స జరిగిన విషయం వాస్తవమే. ఓ సారి వైద్యులు చెక్ చేసి గుండె పోటు లక్షణాలు ఉన్నాయని చెప్పారు. వైద్య పరిక్షల అనంతరం నా గర్భాశయంలో 10 సెంటీ మీటర్ల కణితి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయించుకోవాలని..లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని తెలిపారు. దీంతో నేను సర్జరీ చేయించుకున్నాను. కణితితో పాటు గర్భాశయాన్ని కూడా తొలగించారు. ఇక నేను తల్లిని కాలేనని వైద్యులు చెప్పడంతో ఏడ్చేశాను. నేను తల్లి అవ్వాలంటే.. సరోగసీ ద్వారా పిల్లలను పొందాల్సిందే’ అని రాఖీ సావంత్ ఎమోషనల్ అయింది. ఇక ఆస్పత్రిలో ఉన్నప్పుడు హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచాడని, తన మెడికల్ బిల్లులు మొత్తం ఆయనే కట్టేశాడని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment