ముంబై: సంచలన నటి రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన కామెంట్లు, వింతైన చేష్టలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలవడం ఆమెకు అలవాటు. అదే ఆమెకు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో స్థానం కల్పిచింది. హిందీ బిగ్‌బాస్ తొలి సీజన్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన రాఖీ.. ఫిబ్రవరి 21న ముగిసిన మలి సీజన్-14లోనూ పాల్గొంది. వైల్డ్‌కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా టాప్-5 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. బిగ్‌బాస్ ఇచ్చిన క్యాష్ ప్రైజ్ తీసుకునేందుకు సమ్మతించి రూ. 14 లక్షలతో హౌజ్‌ను వీడింది ఈ హాట్‌భామ. ఇక ఇంటికి చేరుకున్న అనంతరం తన తల్లిని చూసి ఉద్వేగానికి గురైన రాఖీ సావంత్, ఆమె ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించాల్సిందిగా అభిమానులను కోరింది.
కాగా రాఖీ తల్లి జయా సావంత్ క్యాన్సర్ బారిన పడ్డారు. మహమ్మారికి చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం తల్లి ఫొటోలు షేర్ చేసిన రాఖీ... ‘‘అమ్మ కోసం ప్రార్థించండి’’ అని విజ్ఞప్తి చేశారు. ఇక బిగ్‌బాస్ షో నుంచి నిష్క్రమించిన తర్వాత మీడియాతో మాట్లాడిన రాఖీ, తన తల్లిని కాపాడుకునేందుకు ఎంత కష్టాన్నైన్నా భరిస్తానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక షో ద్వారా వచ్చిన డబ్బుతో తనకు చికిత్స చేయిస్తానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. షో వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్‌తో దిగిన ఫొటోలు షేర్ చేసిన ఆమె.. ‘‘దేవుడిచ్చిన అన్నయ్య.. రాజులకు రాజు.. రారాజు.. సల్మాన్ ఖాన్. ఆయనకు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంతోషాలు దక్కాలి’’అని ఆకాంక్షించారు. ఇక హిందీ బిగ్‌బాస్ సీజన్-14 విన్నర్‌గా నిలిచిన రుబీనా దిలైక్ ట్రోఫితోపాటు, 36 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: విడాకులు తీసుకుందామనుకున్నాం.. బిగ్‌బాస్ మళ్లీ కలిపింది
Comments
Please login to add a commentAdd a comment